ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్… ఇకపై వాట్సాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు!

దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తూ దేశంలోనే నెంబర్ వన్ బ్యాంకింగ్ సంస్థగా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తున్నటువంటి ఎస్బిఐ మరొక సరికొత్త సేవల ద్వారా కస్టమర్ల ముందుకు రాబోతోంది. ఇకపై వాట్సప్ ద్వారా మనం తొమ్మిది రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చని ఎస్బిఐ తెలిపింది.

ఇప్పటికే ఆన్లైన్ మొబైల్ ద్వారా ఎన్నో రకాల సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన స్టేట్ బ్యాంక్ ఇకపై వాట్సాప్ ద్వారా కూడా మరికొన్ని సేవలను కస్టమర్లకు చేరువ చేయనుంది. కేవలం మీ మొబైల్ ఫోన్ ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మనం ఇంట్లోనే వాట్సప్ ద్వారా ఏకంగా తొమ్మిది రకాల సేవలను పొందవచ్చు మరి ఆ తొమ్మిది రకాల సేవలు ఏమిటి అనే విషయానికి వస్తే…

వాట్సప్ ద్వారా మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్ సేవ, లోన్ సమాచారం. డిపాజిట్స్ కి సంబందించిన సమాచారాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు. వీటితోపాటు సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్ కి సంబంధించి డీటెయిల్స్ ని చూడచ్చు. అంతే కాక NRI సేవలు, NRE ఖాతా, NRO ఖాతాల్లోని ఫీచర్లు కూడా చూడచ్చు. ఇన్‌స్టా ఖాతాలను తెరవడం, కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెసల్ హెల్ప్‌లైన్‌లు వంటివి తెలుసుకోవచ్చు.