ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై నామిని నీ అప్డేట్ చేయటం చాలా సులభం..?

దేశ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ బ్యాంక్ లలో బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. సాంకేతికతకు అనుకూలంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు అనేక సేవలు అందిస్తుంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉన్న కస్టమర్లు నామినీ ని అప్డేట్ చేసే విషయంలో కస్టమర్లకు శుభవార్త తెలియజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలులోకి తీసుకువచ్చిన కొత్త విధానం ద్వారా నామిని ని చాలా సులభంగా అప్డేట్ చేయవచ్చు.

సాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే అప్లికేషన్ ఫామ్‌లో నామినీ పేరు రాసే ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన సమయంలో అనుకొని కారణాల వల్ల నామినీ వివరాలని ఇవ్వకపోతే ఇప్పుడు మీరు నామినీ పేరు అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ఎస్బిఐ కస్టమర్లు మూడు పద్ధతుల్లో నామినీ వివరాలని అప్డేట్ చేసేయచ్చు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు అప్డేట్ చేయటం :
ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా నామినీ పేరు అప్డేట్ చేయటానికి మొదట మీరు ఆన్‌లైన్ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత Request & Enquries క్లిక్ చేయాలి. ఆ తరవాత ఆన్లైన్ నామినేషన్ పైన క్లిక్ చేసి మీ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసి నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి అంతే.

యోనో ఎస్‌బీఐ ద్వారా నామినీ పేరు అప్డేట్ చేయటం :

యోనో ఎస్‌బీఐ ద్వారా నామినీ పేరు అప్డేట్ చేయటానికి మొదట యోనో ఎస్‌బీఐ యాప్‌ లో లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత Services & Request పైన క్లిక్ చేసి
అకౌంట్ నామినీ పైన క్లిక్ చేసి.. మేనేజ్ నామినీ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీ అకౌంట్ నెంబర్ వివరాలు సమర్పించి నామినీ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.