ఫోన్ పే గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై కార్డు లేకుండా డబ్బు విత్ డ్రా?

ప్రస్తుతం ఫోన్ పే గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే ఎక్కడికి వెళ్ళినా ఇలా ఆన్లైన్ ద్వారా నగదు లావాదేవీలను క్షణాల్లో చేసేస్తున్నారు. ఇకపోతే ఒకప్పుడు విదేశాలకు వెళ్తే మన కరెన్సీ అక్కడ కరెన్సీ లోకి మార్చుకోవాల్సిన అవసరం ఉండేది అయితే ప్రస్తుతం ఈ ఫోన్ పే గూగుల్ పే ద్వారా విదేశాలలో కూడా నగదు లావాదేవీలను చేయవచ్చు. యూపీఐ ఆధారిత యాప్ లను ఓపెన్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కువ శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేయటం వల్ల చాలా పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతూ ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి మోసాలను అరికట్టడం కోసం అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే మనం ఏటీఎం కార్డు లేకుండా కేవలం గూగుల్ పే ఫోన్ పే వంటి యూపీ ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బులను ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాము అయితే గూగుల్ పే ఫోన్ పే వినియోగదారులకు కొన్ని బ్యాంకులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి.

మనకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు లేకుండా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాము. అయితే ఈ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం కుదరదు.ఇకపై డెబిట్ క్రెడిట్ కార్డులు లేకుండా ఏటీఎం నుంచి మనం సులభంగా డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు అయితే ఈ అవకాశం కేవలం కొన్ని బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది. SBI, PNB, HDFC బ్యాంకులు మాత్రమే ఈ సర్వీసును అందిస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటి సేవలను అందించే ఏటీఎంలు కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి అని తెలుస్తుంది. ఏటీఎంలో పై ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మనకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఎంటర్ చేయాలి.అనంతరం పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు కార్డు లేకుండా అమౌంట్ విత్ డ్రా చేసుకోవచ్చు అయితే రోజుకు 5000 వరకు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.