పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్… పిఎఫ్ విత్ డ్రా నిబంధనలలో మార్పులు..?

Why we Should Immediately Withdraw Your PF After Retirement?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరి అయింది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు బ్యాంక్ అకౌంట్ తో పాటు పిఎఫ్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి. పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవచ్చు. పిఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఇటీవల విడుదల చేసిన ఈ ఏడాది బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎఫ్ డబ్బు విత్‌డ్రాపై విధించే పన్ను విషయంలో కీలక మార్పు చేశారు. అంటే ఏప్రిల్ 1, 2023 నుంచి PF విత్‌డ్రా నిబంధనలు మారుతున్నాయి.

సాధారణంగా గతంలో పాన్ కార్డ్ లింక్ చేయని పిఎఫ్ ఖాతాదారులు డబ్బు విత్ డ్రా చేసిన సమయంలో 30 శాతం టీడీఎస్ కట్ చేసే వారు. కానీ ఇప్పుడు దీనిని 30 శాతం నుండి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఖాతాదారుడు తన ఖాతాలోని పీఎఫ్ డబ్బు 5 ఏళ్ల లోపు విత్ డ్రా చేస్తే టీడీఎస్ వసూలు రూల్స్ ప్రకారం సూచించబడిన టీడీఎస్ మెుత్తాన్ని తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఖాతా తెరచి 5 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పిఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్‌డ్రా చేస్తే ఎలాంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

2023 ఏప్రిల్ ఒకటి బడ్జెట్ రూల్స్ ప్రకారం పీఎఫ్ ఖాతా కి పాన్ కార్డు లింక్ చేసినట్లైతే తక్కువ TDS చెల్లించాల్సి ఉంటుంది. పిఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ కి పాన్ కార్డు లింక్ చేసి ఆ తర్వాత అకౌంట్ నుండి రూ.50,000 కంటే ఎక్కువ డబ్బు విత్‌డ్రా చేస్తే కేవలం 10% TDS చెల్లించవచ్చు. అందువల్ల ముందుగా ఖాతాదారులు తమ ఫీఎఫ్ ఖాతాకు పాన్ నంబర్ లింక్ చేయటం చాలా ముఖ్యం. ఒకవేళ ఖాతాదారుల పాన్ కార్డ్ EPFO రికార్డుల్లో అప్‌డేట్ కాకపోతే..కేవలం 20 శాతం మాత్రమే టీడీఎస్ చెల్లించాలి. ఇటీవల జరిగిన కేంద్ర వార్షిక బడ్జెట్ పత్రాల ప్రకారం టీడీఎస్ పై రూ.10,000 కనీస థ్రెషోల్డ్ పరిమితిని కేంద్రం తొలగించింది. ఇది జూలై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. అయితే లాటరీలు, క్రాస్ వర్డ్ పజిల్స్, గేమ్స్ మెుదలైనవాటిపై రూ.10,000 లిమిట్ కొనసాగుతుందని తెలుస్తోంది.