ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ పిఎఫ్ అకౌంట్ తప్పకుండా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రతినెలా తమకి వచ్చే జీవితంలో కొంత భాగం ప్రావిడెంట్ ఫండ్ లో పొదుపు చేసుకోవచ్చు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రతీ నెల జీతం రాకపోవటంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమయంలో ఆర్థికంగా అండగా ఉంటుందని భావించి ఈ స్కీమ్ లో పొదుపు చేసుకోవచ్చు. అలాగే పిల్లల చదువులు, పెళ్లి ఖర్చులకు కూడా ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే ఇటీవల పిఎఫ్ ఖాతాదారులకు అధిక పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అయితే ఈ అదనపు పెన్షన్ పొందడానికే కొంతమంది మాత్రమే అర్హులు. 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్హులైన వారందరూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా అదనపు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొదగించినట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
అర్హులైన వారందరూ మే 3 వరకు అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌వో 2014 సెప్టెంబర్ కన్నా ముందు రిటైర్ అయిన వాళ్లకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా దరఖాస్తు కోసం గడువు పొడిగించడమే కాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ బోర్డు మీటింగ్ డేట్ కూడా వాయిదా పడింది. మార్చి 25, 26న జరగాల్సిన మీటింగ్ మార్చి 27, 28 తేదీల్లోకి మార్చేశారు. ఈ సమావేశంలో అధిక పెన్షన్ అంశంపై కూడా స్పష్టత ఇవ్వొచ్చని సమాచారం.