ప్రేమికులకు శుభవార్త…వాట్సాప్ లో వాలెంటైన్స్ డే స్పెషల్ ఫీచర్స్..?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. వాట్సాప్ అందిస్తున్న ఈ టీచర్స్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. తాజాగా ప్రేమికుల కోసం వాట్సప్ సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు వాలెంటైన్స్ డే ని జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులకు స్పెషల్ విషెస్ చెప్పాలని అందరూ భావిస్తూ ఉంటారు. దీంతో కొంతమంది టెక్స్ట్ రూపంలో, ఫోటోల రూపంలో తమ ప్రియమైన వారికి విష్ చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రేమికులకు వాలెంటైన్స్ డే విషెస్ స్పెషల్ గా చెప్పడం కోసం వాట్సాప్ సంస్థ కొన్ని రకాల ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఆ స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

వాలెంటైన్స్ డే రోజున భాగస్వామి మీకు ఎంత ముఖ్యమో తెలియచేయటానికి మీరు మీ ఆలోచనలతో ఒక చక్కటి వాయిస్ రికార్డు చేసి పంపించవచ్చు. అంతే కాకుండా ఈ ప్రేమికుల రోజున మీ ప్రియమైన వ్యక్తి కోసం అనుకూల నోటిఫికేషన్ టోన్‌ను సెటప్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ టోన్ ద్వారా వారు ఎప్పుడు కాల్ చేస్తారో మీరు ముందే తెలుసుకోవచ్చు. అయితే దీని కోసం మీరు వారి కాంటాక్ట్ మెసేజ్ పై క్లిక్ చేసి, వాల్‌పేపర్, సౌండ్ టోన్‌ను మార్చాలి. అలాగే వాలంటైన్స్ డే రోజున మీరు మీ భాగస్వామిని కలవాలని ప్లాన్ చేసి, ఒకరినొకరు ఎక్కడ కలుసుకోవాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లైవ్ లొకేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. ఈ లైవ్ లొకేషన్ ద్వారా మీ భాగస్వామి ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.

అలాగే వాలంటైన్స్ డే రోజు మీ భాగస్వామి మీపై సరైన శ్రద్ధ చూపడం లేదని మీరు భావిస్తే ఆ సమయంలో మీ సందేహాలకు స్వస్తి చెప్పేందుకు ఎమోజీలు బెస్ట్ ఆప్షన్. ఎమోజి ప్రతిచర్యల ద్వారా మీ భాగస్వామి సందేశాలను గుర్తించడంలో వాట్సాప్ మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు మీ స్టేటస్‌ను వాట్సాప్ లో కూడా షేర్ చేయవచ్చు. ప్రేమికుల కోసం వాట్సాప్ అందిస్తున్న మరొక ఫీచర్ పిన్ చాట్. ఈ ఫీచర్ తో మీరు మీ వాట్సాప్ లిస్టు నుంచి మీ భాగస్వామి చార్ట్‌ను పిన్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వినియోగదారులు దీన్ని ట్యాప్ చేయడం, పిన్ ట్యాప్ చేయడం ద్వారా చేయవచ్చు.