ఇన్ స్టా గ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..ఇక పై సరికొత్త సేఫ్టీ ఫీచర్లు..?

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ తన యూజర్లకు తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై యూజర్లకు మరిన్ని మెరుగైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది. ఈ సేఫ్టీ ఫీచర్లు ద్వారా అభ్యంతరకర, అసభ్యకర మెసేజ్‌లు పంపే ఇతర యూజర్లను చాలా సులభంగా సమర్థవంతంగా బ్లాక్ చేయవచ్చు. అలాగే బ్యాడ్ కామెంట్స్‌ బిల్డర్ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ కొత్త సేఫ్టీ టూల్స్‌ల అప్‌డేట్స్ యూజర్లకు తెలియచేశారు.

“ఈ రోజు మేం ఇన్‌స్టాగ్రామ్‌లో క్రియేటర్స్ & యూజర్లు సురక్షితంగా ఉండటానికి న్యూ నడ్జెస్, అప్‌డేటెడ్ బ్లాకింగ్, హిడెన్ వర్డ్స్ ఇంప్రూవ్‌మెంట్స్ అనే కొత్తసెక్యూరిటీ మార్గాలను అందుబాటులోకి తెచ్చామని ” ఆవిడ ట్వీట్ చేశారు. ఇక ఈ కొత్త సేఫ్టీ ఫీచర్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* నడ్జెస్ : ఈ సరికొత్త నడ్జెస్ సేఫ్టీ ఫీచర్ యూజర్ల కామెంట్స్, డైరెక్ట్ మెసేజ్‌లలో బ్యాడ్ వర్డ్స్ పంపించకుండా ఓన్లీ రెస్పెక్టబుల్ వర్డ్స్ పంపేలా చేస్తుంది. హెల్ప్ కీప్ ఇన్‌స్టాగ్రామ్ ఏ సపోర్టివ్ ప్లేస్” అనే పాప్-అప్‌ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ల మధ్య గౌరవప్రదమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ సేఫ్టీ ఫీచర్ హెల్ప్ అవుతుంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, స్పానిష్, ఫ్రెంచ్, చైనీస్ లేదా అరబిక్‌ లాంగ్వేజ్ లో యాప్స్ వాడే యూజర్లకు ఈ నడ్జెస్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

• బ్లాకింగ్ : ఇంస్టాగ్రామ్ యూజర్లు ఎవరైనా బ్లాక్ చేస్తే మళ్లీ ఆ యూజర్లను కాంటాక్ట్ అవ్వకుండా బ్లాకింగ్ ఫీచర్‌ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. ఈ కొత్త ఫీచర్‌ వల్ల ఎవరినైనా బ్లాక్ చేసిన తరువాత వారి బ్లాక్డ్‌ అకౌంట్‌తో పాటు వారికి సంబంధించిన మిగతా అకౌంట్స్‌ కూడా సులభంగా బ్లాక్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఇతర యూజర్లు కొత్త అకౌంట్స్ ఉపయోగించి వెంబడించడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడకుండా ఈ కొత్త బ్లాకింగ్ ఉపయోగపడుతుంది.

• హిడెన్ వర్డ్స్ డిటెక్షన్ : ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ద్వారా యూజర్లు కొన్ని పదాలను ఎమోజీలను ఎవరికీ కనిపించకుండా ఒక కస్టమ్ వర్డ్స్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వార మనం సీక్రెట్ ఉంచలనుకున్న పదాలను ఎవరికి కనిపించకుండా హైడ్ చేయవచ్చు. ఈ సెట్టింగ్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.