ప్రస్తుతం ఎక్కువమంది డిజిటల్ లావాదేవీల ద్వారా పెద్ద ఎత్తున నగదును చెల్లించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది గూగుల్ పే ఫోన్ పే ద్వారా నిత్యం నగదు లావాదేవీలను. ఇకపోతే ఫోన్ పే గూగుల్ పే ద్వారా నెలకు ఇంతే ట్రాన్సాక్షన్ చేయాలి అనే నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ఇలాంటి నిబంధనలు కనుక అమలులోకి తీసుకువస్తే నెలలో కేవలం పరిమిత ట్రాన్సాక్షన్లు మాత్రమే చేయాల్సి ఉంటుందని ఆపై అదనపు భారం మనపై పడుతుందని అందరూ భావించారు.
తాజాగా ఈ విషయంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక ప్రకటన చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మార్కెట్ క్యాప్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.సాధారణంగా గూగుల్ పే, ఫోన్‌పే వంటి థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్‌కు సంబంధించి ఎన్‌పీసీఐ 30 శాతం మార్కెట్ వాటారూల్ తీసుకువచ్చింది. ఈ రోల్ ఈ ఏడాది డిసెంబర్ తో ముగియనుంది అయితే ఈ విషయం పై పునరాలోచన చేసినటువంటి మార్కెట్ క్యాప్ ఈ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్‌పీసీఐ మాత్రం ఈ డెడ్‌లైన్‌ను మరో రెండేళ్లు పొడిగించింది. అంటే 2024 డిసెంబర్ 31 వరకు వీటికి గడువు లభించింది. దీని వల్ల ఈ యాప్స్ ఉపయోగిస్తున్న వారికి పరిమిత ట్రాన్సాక్షన్స్ లేకుండా ఇప్పుడు ఎలాగైతే మనం ట్రాన్సాక్షన్స్ జరుపుతున్నాము అదే విధిగా జరపవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి రెండూ మార్కెట్ లీడర్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఫోన్‌పే మార్కెట్ వాటా ఏకంగా 47 శాతంగా, గూగుల్ పే 34% వాటా కలిగి ఉంది.ఇక కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత 30% కన్నా వాట పెరగకూడదు తద్వారా గూగుల్ పే ఫోన్ పే వాడే వారికి పరిమిత ట్రాన్సాక్షన్స్ ఉపయోగించాల్సి ఉంటుంది అయితే మరో రెండు సంవత్సరాలు పాటు ఎలాంటి నిబంధనలు లేకుండా మనం నగదు లావాదేవీలను చేసుకోవచ్చు.