యూపీఐలో రాంగ్ పేమెంట్ చేశారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలకు చెక్!

ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా ప్రతిరోజూ కొన్ని వందల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే యూపీఐలో ఏదైనా పొరపాటు వల్ల రాంగ్ పేమెంట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ సంఖ్యలో డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. యూపీఐ పేమెంట్స్ కు సంబంధించి రాంగ్ పేమెంట్స్ జరిగితే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు.

యూపీఐ లావాదేవీలు తరచూ చేసేవాళ్లు యూపీఐ లావాదేవీలో పొరపాటు ఎక్కడ జరిగిందో మొదట నిర్ధారించుకుంటే మంచిది. ఆ తర్వాత బ్యాంక్ అధికారులను సంప్రదించి లావాదేవీకి సంబంధించిన యూటీఆర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకులకు లావాదేవీలు చేసిన వాళ్లు ఆ వ్యక్తి బ్యాంక్ సంప్రదించడం ద్వారా డబ్బు వెనుకకు పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఇందుకోసం ఏకంగా 7 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. కొన్నిసార్లు యూపీఐల ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే ఉండగా వాళ్ల సూచనలను పాటిస్తే మంచిది. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు విషయంలో వేగంగా రియాక్ట్ అయితే అంతే వేగంగా రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం డబ్బులు వెనక్కు వచ్చే అవకాశాలు ఉండవు.

వేరే నంబర్ కు పొరపాటున డబ్బులు పంపితే వెంటనే ఆ వ్యక్తులను వేగంగా సంప్రదించడం ద్వారా డబ్బులను తిరిగి పొందే అవకాశాలు అయితే ఉంటాయి. యూపీఐ లావాదేవీలు వేగంగా పూర్తి చేసేవాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. ఈ అలవాటును మార్చుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.