పాత నోట్లు ఉన్న ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. పాత నోట్లతో కొత్త నోట్లు పొందే అవకాశం..?

సాధారణంగా చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. వాటికి బయట మార్చటానికి కుదరదు. అందువల్ల చాలామంది తమ వద్ద ఉన్న పాత నోట్లు ఎందుకు పనికి రావని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే అలాంటి వారు ఎలాంటి టెన్షన్‌ పడకుండా కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది.
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. కస్టమర్ల కోసం పీఎన్‌బీ బ్యాంకు కస్టమర్ల కోసం ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ ల వద్ద పాత నోట్లు ఏమైనా ఉండి.. వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే వాటిని మార్పించడానికి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త సంవత్సరంలో మీ వద్ద ఉన్న పాత నోట్లను ఇచ్చి కొత్త నోట్లను పొందాలనుకుంటే మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వెళ్లాలి. పాత నోట్లు బ్యాంకులో చెల్లించి బ్యాంక్ నుండి కొత్త నోట్లు మార్చుకొని అవకాశం కల్పిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబరు 28 వ తేదీన కొత్త సంవత్సరం, కొత్త నోట్లు అని బ్యాంకు ట్వీట్‌ చేసింది. ఆర్.బి.ఐ నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించి పాత నోట్లు బ్యాంకులో ఇచ్చి కొత్త నోట్లు పొందవచ్చు. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. అయితే మీ వద్ద ఉన్న పాత నోట్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.