స్మార్ట్ ఫోన్ ఎక్సేంజ్ చేస్తున్నారా…జాగ్రత్త ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…?

ప్రస్తుత కాలంలో ఫోన్ కొంచెం పాడైన సరే కొత్త ఫోన్ కొనటానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. లేదా కొత్త మోడల్స్ మార్కెట్లోకి రావడం వల్ల వాటి మీద మోజుతో కొత్తవి కొనటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఎలా కొత్త ఫోన్ కొనేటప్పుడు ఎక్స్చేంజ్ ఆఫర్ లో పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్‌ లో వివిధ రకాల కంపెనీలు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంచాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఫోన్ కొనేటప్పుడు కొన్ని సందర్భాలలో మీ పాత ఫోన్ మంచి స్థితిలో ఉన్నా కూడా కొన్ని కంపెనీలు తక్కువ ధరను నిర్ణయిస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ పాత ఫోన్ కి మంచి ధరని పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎక్స్చేంజ్ ఆఫర్లో మీ పాత మొబైల్ కి మంచి ధర రావాలంటే మీ పాత ఫోన్ ని కొత్తదానిలా ముస్తాబు చేయాలి. అదేనండి క్లీన్ చెయ్యడం.. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకునే ముందు దానిని శుభ్రం చేయడం మరచిపోవద్దు. లేదంటే ఎక్సేంజ్ లో చాలా తక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ ఫోన్ నీట్ గా లేకపోతే ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉండదు. అందుకే ఎల్లప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ని శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే మీరు ఫోన్ కొనిన కొంత కాలానికి దాని వెనుక ప్యానెల్‌పై గీతలు పడుతాయి. దీంతో ఫోన్ పాత దానిలా కనిపిస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసేటప్పుడు వెనుక ప్యానెల్‌ను కూడా మార్చాలి. అప్పుడు ఫోన్‌ కొత్తదిలా మెరుస్తుంది. అలాగే మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకునేటప్పుడు ఆ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం తప్పనిసరి. దీంతో ఫోన్ వేగాన్ని పెంచుతుంది. ఇలా మీ ఫోన్‌కు మంచి ధర లభిస్తుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే ఎక్సేంజ్ ఆఫర్ లో మీ పాత ఫోన్ కి మంచి ధర లభిస్తుంది.