స్మార్ట్ ఫోన్ ఎక్సేంజ్ చేస్తున్నారా… పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి!

ప్రస్తుత కాలంలో మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ వచ్చిందంటే చాలామంది కొత్త ఫోన్ కొనడానికి ఆసక్తి చూపిస్తారు ఈ క్రమంలోనే పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయటం వల్ల కొంత అమౌంట్ తగ్గుతుందని భావించి చాలామంది పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తూ కొత్త ఫోన్ కొనుగోలు చేస్తూ ఉంటారు.ఇలా ఫోన్ ఎక్స్చేంజ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి లేదంటే ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇలా స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకునే సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు అసలు చేయకూడదు. ఇలా మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసే సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ పాత ఫోన్ కి మంచి ధరని పొందవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎక్స్చేంజ్ ఆఫర్లో మీ పాత మొబైల్ కి మంచి ధర రావాలంటే మీ పాత ఫోన్ ని కొత్తదానిలా తయారు చేయాలి అంటే పాత ఫోన్ నీట్ గా శుభ్రంగా పెట్టడం ఎంతో మంచిది. లేదంటే ఎక్సేంజ్ లో చాలా తక్కువ మొత్తాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీ ఫోన్ నీట్ గా లేకపోతే ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఏ కంపెనీ సిద్ధంగా ఉండదు. అందుకే ఎల్లప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ని శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే మీరు ఫోన్ కొనిన కొంత కాలానికి దాని వెనుక ప్యానెల్‌పై గీతలు పడుతాయి. దీంతో ఫోన్ పాత దానిలా కనిపిస్తుంది. అందుకే స్మార్ట్‌ఫోన్‌ ఎక్సేంజ్‌ చేసేటప్పుడు వెనుక ప్యానెల్‌ను కూడా మార్చాలి. అప్పుడు ఫోన్‌ కొత్తదిలా మెరుస్తుంది. అలాగే మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్సేంజ్‌ చేసుకునేటప్పుడు ఆ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం తప్పనిసరి. దీంతో ఫోన్ వేగాన్ని పెంచుతుంది. ఇలా మీ ఫోన్‌కు మంచి ధర లభిస్తుంది. ఇలాంటి టిప్స్ పాటిస్తే ఎక్సేంజ్ ఆఫర్ లో మీ పాత ఫోన్ కి మంచి ధర లభిస్తుంది.అలాగే స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకునే సమయంలో ఆ ఫోన్లో మీది ఏదైనా వ్యక్తిగత డేటా ఉంటే వెంటనే వాటిని కూడా మీరు పెన్ డ్రైవ్ లోకి మార్చుకోవడం లేదా ఇతర ఫోల్డర్ లోకి మార్చుకోవడం చేయాలి ఇలా మర్చిపోయి మీ డేటాతో సహా ఎక్స్చేంజ్ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి.