సాధారణంగా మనం బ్యాంకు నుంచి రుణం పొందాలంటే అందుకు సంబంధించి అప్లికేషన్స్ సమర్పించడమే కాకుండా వాటితో పాటు ఎన్నో రకాల డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్ కి సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆదాయపు పన్ను రిటర్న్ డాక్యుమెంట్ అందించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే ఏదైనా ఉద్యోగంలో స్థిరపడిన వ్యక్తి ఈ విధమైనటువంటి ఐటిఆర్ సర్టిఫికెట్ అందించడానికి ఎంతో సులువుగా ఉంటుంది. అలా కాకుండా స్వయం ఉపాధి పై ఆధారపడే వారికి ఇలా ఐటిఆర్ సర్టిఫికెట్ తీసుకోవడం చాలా కష్టతరం అవుతుంది.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బ్యాంక్ ఇకపై ఐటిఆర్ సర్టిఫికెట్ లేకపోయినా బ్యాంకు రుణాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. మరి ఐటిఆర్ పత్రం లేకుండా బ్యాంకు రుణం ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే.. మనం వ్యక్తిగతంగా రుణం తీసుకోవాలి అనుకుంటేఇందులో ఎవరైతే వ్యక్తిగత లోన్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటివారు ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన పనిలేదు. కేవలం ఆ వ్యక్తి నెలసరి ఆదాయం వారి వివరాల ఆధారంగా ఈ లోన్ ఇవ్వబడుతుంది.
ఇలా ఐటిఆర్ సర్టిఫికెట్ లేకుండా లోన్ తీసుకోవాలనుకునేవారు క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక పర్సనల్ లోన్ విషయంలో నెలవారి జీతం తప్పనిసరిగా ఉండాలి.ఇక ఎవరైతే స్వయం ఉపాధి ద్వారా వచ్చే ఆదాయంపై రుణం తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి వారు మాత్రమే ఐటిఆర్ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.ఉద్యోగులు చూపించడానికి ఆదాయ రుజువు, ఫారమ్ 16 వంటి పత్రాలను కలిగి ఉంటారు. మీరు రుణం తీసుకోవడానికి ఏదైనా కొలేటరల్ లేదా సెక్యూరిటీని ఉపయోగిస్తే ఈ సందర్భంలో రుణం సులభంగా లభిస్తుంది.