పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా… ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా మనం మన పిల్లల ఉన్నత చదువుల కోసం లేదా ఇంటి నిర్మాణం చేపట్టడానికి ఇతరత ఖర్చులకోసం చాలామంది బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణాలను తీసుకుంటూ ఉంటారు. ఇలా వ్యక్తిగత రుణాలను పొందడం ద్వారా మన అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. అయితే ఒకసారి బ్యాంకు నుంచి మనం వ్యక్తిగత రుణం తీసుకుంటున్నాము అంటే ముందుగా కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత రుణాలకు అప్లై చేయడం మంచిది.ముందుగా మీరు వ్యక్తిగత రుణం తీసుకోవాలి అనుకుంటే ఏ బ్యాంక్ లో అయితే వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ చార్జీలు తక్కువగా ఉంటాయో ఆ బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణాలు పొందడం ఎంతో మంచిది.

కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలకు వడ్డీరేట్లను తక్కువగా వేసి ప్రాసెస్ ఇంచార్జీలను అధికంగా వేస్తుంటారు ఈ విషయాన్ని ముందుగా అడిగి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక పర్సనల్ లోన్ ఎప్పుడూ కూడా మీ ప్రొఫైల్ పైనే ఆధారపడి ఉంటుంది కనుక మీకు క్రెడిట్ స్కోర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటేనే వీలైనంత తొందరగా మీకు బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని శాంక్షన్ చేస్తారు.

మీరు వ్యక్తిగత రుణం పొందడానికన్నా ముందుగా ఇతర లోన్లు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో చెల్లించాలి అనంతరం వ్యక్తిగత రుణాలకు అప్లై చేసుకోవాలి ఇక కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణం ఇచ్చిన తర్వాత జప్తు కోసం ఫినాల్టీలను కూడా అధికంగా విధించే అవకాశాలు ఉంటాయి కనుక ముందుగా ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకున్న తర్వాతనే మనం వ్యక్తిగత లోన్ కి అప్లై చేయాలి. ఎవరైతే మీ క్రెడిట్ స్కోర్ ఎంతుందో తెలుసుకోవాలంటే వాట్సాప్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూసేద్దాం. Experian India వాట్సాప్ నంబర్ 9920035444 కు Hai అని మీరు మెసేజ్ చేయాలి. లేదా మీరు https://wa.me/message/LBKHANJQNOUKF1 కి వెళ్లి తెలుసుకోవచ్చు. డెయిల్స్ ఇచ్చేస్తే సరి పోతుంది.