సాధారణంగా ఆర్థిక సమస్యల వల్ల చాలామంది బ్యాంకులలో, లోన్ ఆప్స్, ఫైనాన్షియల్ సంస్థలలో రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే లోన్ ఆప్స్ లో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ సంస్థలలో ఏదైనా తాకట్టు పెడితే కానీ రుణాలు మంజూరు చేయరు. అయితే కొన్ని బ్యాంకులు ద్వారా ఎటువంటి షూరిటీ లేకుండానే లోన్ తీసుకొని అవకాశాలు ఉంటాయి. కొల్లాటరల్ రుణాలు ఇచ్చేందుకే బ్యాంకులుఎక్కువగా సుముఖతతో ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇళ్లు, ఎల్ఐసీ పాలసీలను కొల్లాటరల్‌గా పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. ఇల్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి లేనప్పుడు తమ ఎల్ఐసీ పాలసీని చూపించి లోన్ తీసుకోవచ్చు.
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పాలసీదారులకు వారి పాలసీలపై రుణాలు ఇస్తుంటాయి.అయితే ఎల్ఐసీ పాలసీలతో రుణాలు తీసుకునే వ్యక్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి పాలసీని కొల్లాటరల్ చూపించి లోన్ తీసుకొని వ్యక్తి మరణిస్తే, పాలసీ డబ్బులు మొత్తం నామినీకి రావు.
ఆ పాలసీ లో మనం చెల్లించాల్సిన లోన్ మొత్తం బ్యాంకుకు వెళ్ళగా పాలసీలో మిగిలిన మొత్తాన్ని నామినీకి అందిస్తారు. అయితే ఎల్ఐసి ద్వారా లోన్ తీసుకోవాలని భావించేవారు పొరపాటున కూడా కొత్త పాలసీ తీసుకొని లోన్ తీసుకోకూడదు. కొత్త పాలసీ తీసుకొని దానిపై లోన్ తీసుకోవాలని కొన్ని కంపెనీలు ఒత్తిడి చేస్తూ ఉంటాయి. అయితే కేవలం లోన్ తీసుకోవడం కోసం మాత్రమే కొత్త పాలసీ తీసుకోవడం వల్ల కొంతవరకు నష్టపోవాల్సి వస్తుంది. అలా కొత్త పాలసీ తీసుకొని లోన్ తీసుకోమని ఒత్తిడి చేసే కంపెనీలను కాకుండా పాత పాలసీ ని కొల్లాటరల్ స్వీకరించి లోన్ ఇచ్చే కంపెనీలను మాత్రమే ఎన్నుకోవటం ప్రయోజకరం. ఎల్ఐసి పాలసీ ద్వారా లోన్ తీసుకోవాలనుకునేవారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.