ఓటు అనేది ప్రతి పౌరుడు హక్కు. దేశ పౌరులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ సమస్యలను తీర్చే నాయకులను ఎన్నుకోవచ్చు. ఈ ఓటు హక్కు ద్వారా ప్రజలు తమకు నచ్చని ప్రభుత్వాలను గద్దె దింపే హక్కు ఉంటుంది. మన భారతదేశంలో 18 సంవత్సరాల నిండిన యువతి యువకులకు ఓటు హక్కు పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాలు వయసు నిండిన యువతీ యువకులందరూ తప్పకుండా ఓటర్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే కొంతమంది ఓటు కోసం అప్లిటీచేసుకున్నా కూడా వెంటనే రాదు.
ఎలక్షన్స్ సమయంలో ఓటర్ల లిస్ట్ లో కొంతమంది పేరు ఉండదు. అలా ఓటర్ లిస్ట్ లో పేరు లేని వారు ఓటు వేయటానికి అవకాశము ఉండదు. అందువల్ల ఓటు హక్కు ఉన్న ప్రతీ పౌరుడు ఎలక్షన్స్ సమయంలో ఓటర్ లిస్ట్ లో తమ పేరు ఉందో? లేదో? తప్పకుండా తెలుసుకోవాలి. అయితే ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవటం ఎలాగో మీకు తెలియటం లేదు. చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటె ఓటర్ల జాబితాలు పేరు ఉందో? లేదో? తెలుసుకోవటం ఇప్పుడు చాలా సులభం. ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవడానికి ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంట్లో కూర్చుని మొబైల్ ఫోన్ ఉపయోగించి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ఇప్పుడు మరింత సులభం. అలా తెలుసుకోవడం కోసం ముందుగా https://voterportal.eci.gov.in/ వెబ్ సైట్ కి వెళ్లాలి. ఆతర్వాత ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగంపై క్లిక్ చేసి అక్కడ ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.ఇలా చేసిన వెంటనే ఓటర్ల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడమే కాకుండా ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది, సీరియల్ నెంబర్ ఎంత వంటి వివరాలు కూడా అక్కడ కనిపిస్తాయి.