సాధారణంగా ప్రతి భారతీయ పౌరుడికి 18 సంవత్సరాల వయసు కలిగి ఉంటే తప్పనిసరిగా వారికి ఓటు హక్కు ఉంటుంది ఇలా ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉంటుంది ఇలా ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఓటర్ కార్డ్ వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.ఇలా ఓటర్ కార్డు లేని పక్షంలో కొన్నిసార్లు మన ఓటు వేయడానికి అవకాశం లేకుండా పోతుంది.అయితే ఓటర్ కార్డు లేకుండా ఇకపై మనం ఎంతో సులభంగా ఓటు వేయవచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం…
కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్, పాన్ కార్డు వంటి ఇతర గుర్తింపు కార్డుల మాదిరిగా ఓటర్ కార్డ్ డిజిటల్ కాపీ ఇప్పుడు మీ మొబైల్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఓటర్ కార్డ్ చూపించి మనం ఎన్నికల సమయంలో కూడా మన ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా కేవలం 1 శాతం మంది మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆన్లైన్ లో డిజిటల్ ఓటర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డిజిటల్ ఓటర్ కార్డ్ డౌన్లోడ్ చేయటానికి ముందుగా ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి. ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
మీ ఓటర్ వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తరువాత ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్‌లో డిజిటల్ కార్డు ఉంటుంది.