ఒక వ్యక్తికి గుర్తింపునిచ్చి కార్డులలో పాన్ కార్డు కూడా ఒకటి. అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా బైక్, కారు, చిన్న ఫ్లాట్ నుంచి ఏది కొన్నా కూడా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అందుకే రైతులు విద్యార్థులు ఉద్యోగస్తులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండటం చాలా అవసరం. అయితే పాన్ కార్డు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాలలో వాటిలో ఉన్న పేరు, చిరునామా వంటి మన డీటెయిల్స్ మార్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా మహిళలు వివాహం తర్వాత ఇంటి పేరును మార్చుకోవటం తప్పనిసరి.
అటువంటి సందర్భాలలో పాన్ కార్డ్ లో ఇంటిపేరు మార్చుకోవటానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లో సులభంగా పాన్ కార్డులో మీ ఇంటి పేరును మార్చుకోవచ్చు.
• పాన్ కార్డు లో ఇంటి పేరు ని మార్చుకోవడానికి మొదట మీరు www.tin-nsdl.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
• ఆ తరవాత అక్కడ కనిపించే సర్వీసెస్ విభాగం లో PAN అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
• ఆ తర్వాత కింద Change/Correction in PAN Data అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
• అప్లికేషన్ టైప్ ని సెలెక్ట్ చేసుకుని ఛేంజేస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా మీద సెలక్ట్ చేసుకోవాలి.
• ఆ తర్వాత పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
• పాన్ కార్డుకు సంబంధించిన వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. అప్పుడు కింద బటన్ నొక్కగానే పేరు కరెక్షన్‌కు సంబంధించి పేజీ ఓపెన్ అవుతుంది.
• పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు వీటిని మీరు సెలెక్ట్ చెయ్యండి.
• పాన్ కార్డులో మనం మార్పు చేయవలసిన వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత నిర్ధేశించిన పేమెంట్ చెయ్యండి.
• ఆ తర్వాత మీరు కార్డును అప్‌డేట్ చేసినట్లు ఓ స్లిప్ వస్తుంది. చేసుకోని దానిపై రెండు ఫొటోలు అతికించి.. వీటిని మీరు ఎన్‌ఎస్‌డీఎల్ కార్యాలయానికి పంపించి కొత్త ఇంటిపేరు తో ఉన్న పాన్ కార్డ్ పొందవచ్చు.