ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగమైనటువంటి డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు ఒకటి.మనం పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలను జరపాలన్న తప్పనిసరిగా పాన్ కార్డు ఎంతో కీలకంగా మారింది. ప్రతి ఒక్క పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యమైనదని చెప్పాలి. మనదేశంలో పాన్ కార్డు అనేది మనిషికి ఒక గుర్తింపు కార్డు. ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి పాన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వ్యక్తికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని రూల్ ఉంది.
పాన్ కార్డు తీసుకున్న తర్వాత ఆధార్ కార్డులో మీ పేరు ఫోన్ నెంబర్ చిరునామా ఎలా ఉందో పాన్ కార్డులో కూడా అలాగే ఉండాలి అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని తప్పులు దొర్లుతూ ఉంటాయి. పేరు తప్పు పడడం చిరునామ తప్పబడడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తప్పులుకనుక ఉంటే మనం వెంటనే అప్డేట్ చేసుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి అప్డేట్స్ చేయాలంటే ఇంట్లోనే కూర్చొని చాలా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
ఇలాంటి తప్పులను సరి చేయడానికి కేంద్ర ప్రభుత్వం మనకు ఆన్లైన్ ఆఫ్ లైన్ వెసులుబాటులో కల్పించింది.
మనకు పాన్ కార్డులో ఏవైనా తప్పులు దొర్లితే ముందుగా మనం ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయటానికి ముందుగా ఐటీ విభాగం అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ‘పన్ను చెల్లింపుదారుల సేవలు’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘పాన్ గ్రీవెన్స్’ సెక్షన్‌కెళ్లాలి. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. వెంటనే మీ కంప్లయింట్‌తోపాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్ కార్డ్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ) నమోదు చేసి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. ఆఫ్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఆదాయం పన్ను విభాగం హెల్ప్ డెస్క్-18001801961, TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ +91 2027218080 నంబర్‌కు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ask@incometax.gov.in అనే ఈమెయిల్ ఐ డి కి మెయిల్ చేయవచ్చు.