కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పేరుతో ఈ స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ లో చేరిన వ్యక్తి సంవత్సరానికి 436 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రీమియం చెల్లించడం ద్వారా 2 లక్షల రూపాయల బీమా చెల్లించాల్సి ఉంటుంది. నెలకు కేవలం 40 రూపాయల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.
2015 సంవత్సరం మే నెల 9వ తేదీ నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీవిత బీమా పథకం ఈ స్కీమ్ కాగా ఈ స్కీమ్ ద్వారా పేదల అభివృద్ధి దిశగా మోదీ సర్కార్ అడుగులు చేస్తుండటం గమనార్హం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తో మోదీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుని ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం మే నెల 31వ తేదీన ఈ మొత్తం బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.
ఒకసారి ప్రీమియం చెల్లిస్తే సంవత్సరం పాటు బీమా ఉంటుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కాలపరిమితి జూన్ 1 నుంచి మే 31 వరకు అమలులో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీ డబ్బులు పొందే అవకాశాలు ఉంటాయి. ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని సమాచారం అందుతోంది.
ప్రమాదవశాత్తు మరణిస్తే 24 గంటల్లో ఈ పాలసీని అమలు చేయవచ్చు. ఈ స్కీమ్ లో చేరడానికి గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు కాగా బీమా కవరేజ్ 55 సంవత్సరాలకు ఉండనుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబరు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఎల్ఐసీ ఆమ్ ఆద్మీ బీమా యోజన పత్రాలను సబ్మిట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.