నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు.. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగ ఖాళీలు!

మనలో చాలామంది అర్హత ఉన్నా సరైన ఉద్యోగం లేక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 84 కంపెనీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ సంస్థ సిద్ధమైంది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఏపీఎస్ఎస్ డీసీ, సీడాక్ సంయుక్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయి.

విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 31వ తేదీన ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ జాబ్ మేళాను నిర్వహిస్తారు. ఐటీ, ఫార్మా, రిటైల్, మెడికల్, ఆటో మొబైల్, ఇతర రంగాలకు సంబంధించిన కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి.

ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండగా భారీ సంఖ్యలో నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సులువుగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

పాన్ కార్డు, ఆధార్ కార్డు, సర్టిఫికెట్లతో ఈ ఉద్యోగ ఖాళీలకు హాజరు కావాల్సి ఉంటుంది. చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బెనిఫిట్ కలగనుంది.