త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఈ_ బ్యాండేజ్… దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

సాధారణంగా మనం రోజువారి కార్యకర్త కలాపాలలో భాగంగా ఎన్నోసార్లు గాయపడుతూ ఉంటాము ఇలా గాయపడినప్పుడు తొందరగా ఆ గాయానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కాకుండా బాండేజ్ వేస్తుంటాము ఇప్పటివరకు మనం మార్కెట్లో సాధారణ బ్యాండేజ్ లను కొనుగోలు చేసి గాయాలు తగిలిన చోట ఆ బ్యాండేజ్ లను ఉపయోగిస్తూ ఉన్నాము అయితే ఇకపై మార్కెట్లోకి ఈ- బ్యాండేజ్ రాబోతోంది. ఈ -బ్యాండేజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ-బ్యాండేజస్ పై నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ వాళ్లు పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. సాధారణ బ్యాండేజ్ తో పోలిస్తే ఈ బ్యాండేజస్ వల్ల మీకు అయిన గాయం 30 శాతం వేగంగా తగ్గుతుంది. ఈ బ్యాండేజస్ ఎలక్ట్రోథెరపీ సాయంతో గాయాన్ని మాన్పించే దిశగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.అయితే ఈ బ్యాండేజ్ షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుందని నిపుణులు తెలియజేశారు.

సాధారణంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఏదైనా గాయం తగిలితే తొందరగా ఆ గాయం నయం కాదు అలాంటివారికి ఈ – బ్యాండేజ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. ఈ బ్యాండేజ్ లో రెండు ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. చిన్న పువ్వు గుర్తుతో ఉండే ఎలక్ట్రోడ్ ఒకవైపు ఉంటే.. రెండోవైపు రింగ్ సింబల్ తో ఉండో ఎలక్ట్రోడ్ ఉంటుంది. దీనిలో శక్తిని ఉత్పత్తి చేసే కాయిల్ ఒకటి ఉంటుంది. ఇవి గాయాల్లోకి ఎలక్ట్రోడ్స్ ని పంపుతూ త్వరగా నయం అయ్యేలా చేస్తాయి.