Ram Charan: రామ్ చరణ్ కి అసలేం అయ్యింది.. చేతికి ఆ కట్టు ఏంటి.. వీడియో వైరల్!

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మన అందరికి తెలిసిందే. చెర్రీ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా చరణ్ చివరగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ఊహించని విధంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రామ్ చరణ్ తన ఆశలన్నీ కూడా తదుపరి సినిమాపై పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు రామ్ చరణ్. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాజాగా గురువారం హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.

ఇందులో రామ్ చరణ్, రౌడీ బాయ్ విజయ దేవర కొండ కూడా పాల్గొన్నారు. అయితే కార్యక్రమం చివరిలో భాగంగా అందరూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. అయితే ఈ సమయంలో రామ్ చరణ్ కొంచెం ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. అతని చేతికి కట్టు కూడా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు షాక్ అయ్యారు. అసలు రాంచరణ్ చేతికి ఏమైంది? ఎందుకు అంత పెద్ద బ్యాండేజ్ వేశారు? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ విషయం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పెద్ది సినిమా షూటింగ్ లో గాయపడినట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఈ వీడియో పై రాంచరణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. పెద్ది సినిమా విషయానికి వస్తే.. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేంద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పెద్దిపై అంచనాలను అమాంతం పెంచేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు.