ఇప్పటివరకుమనం బ్యాంకు క్రెడిట్ కార్డుల గురించి చూశాం కానీ ఎల్ఐసి క్రెడిట్ కార్డుల గురించి చాలామందికి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. అయితే భారతదేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చి ఎన్నో రకాల సదుపాయాలను కస్టమర్లకు కల్పిస్తోంది. అయితే తాజాగా ఎల్ఐసి క్రెడిట్ కార్డులను కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది.
ఎల్ఐసి ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకులతో కలిసి టైఅప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే.. మరి ఎల్ఐసి క్రెడిట్ కార్డులు ఇవ్వడం వల్ల పాలసీదారుడికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ క్రెడిట్ కార్డు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే విషయానికి వస్తే…ఇక ఈ క్రెడిట్ కార్డులు ప్రీమియం డిపాజిట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. యాక్సిస్ బ్యాంకుతో టైఅప్ అయిన ఎల్ఐసీ మూడు రకాల క్రెడిట్ కార్డులను తమ యూజర్లకు అందిస్తూ వస్తోంది. ఇందులో ఎల్ఐసీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ ప్లాటినం క్రెడిట్ కార్డు, ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డు వంటివి మూడు కార్డులు అందుబాటులోకి తీసుకురానుంది.
సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యూజర్లు చెల్లించే ప్రతి వంద రూపాయలు ప్రీమియం డిపాజిట్‌కు 2 రివార్డు పాయింట్లు, ఖర్చు చేసే ప్రతి వంద రూపాయలకు ఒక రివార్డు పాయింట్ ఇస్తుంది ఈ కార్డు వల్ల వ్యక్తిగత ప్రమాద బీమా ఐదు లక్షలు, యాక్సిడెంట్ కవరేజ్ కింద కోటి రూపాయలు ఇవ్వనుంది. ఎల్ఐసి ప్లాటినం క్రెడిట్ కార్డు ద్వారా మీరు డిపాజిట్ చేసే 100 రూపాయలకు రెండు రివార్డు పాయింట్లు అలాగే వ్యక్తిగత ప్రమాద భీమా కింద 3 లక్షలు వస్తుంది. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ బీమా 1 కోటి రూపాయల వరకూ అందుతుంది. ఎల్ఐసీ టైటానియం క్రెడిట్ కార్డులో కూడా చెల్లించే ప్రతి వంద రూపాయల ఎల్ఐసీ ప్రీమియం డిపాజిట్‌పై 2 రివార్డు పాయింట్లు,కార్డు నుంచి 100 రూపాయలు ఖర్చు చేస్తే 1 రూపాయి రివార్డు కూడా వస్తుంది.