ప్రస్తుత కాలంలో అధిక మొత్తంలో లావాదేవీలను నడిపించాలి అంటే తప్పనిసరిగా పాన్ కార్డు ఎంతో అవసరం. మనకు ఎంతో కీలకంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ లలో పాన్ కార్డు కూడా ఒకటనే విషయం అందరికీ తెలిసిందే. పన్ను శాఖ జారీ చేసే ఈ 10 అంకెల కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. ఇక ఒక వ్యక్తి ఎంత మొత్తంలో ఆర్థిక లావాదేవీలను జరుపుతున్నారు అనే విషయాలను కూడా ఈ పాన్ కార్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు.
ఇలా ఎంతో కీలకడాక్యుమెంట్ అయినటువంటి పాన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తలు వ్యవహరించాలి పొరపాటున కూడా ఈ క్రింది తెలిపిన తప్పులను చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే పాన్ కార్డు విషయంలో ఈ తప్పులు పొరపాటున కూడా చేయకూడదు. రిటర్న్‌ను దాఖలు చేసే సమయంలో పాన్ కార్డుకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. తప్పుడు పాన్ వివరాలను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో చెయ్యకూడదు. ఇలా చేయటం వల్ల అధికారులు మనకు రూ.10,000 జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.
ఇక చాలామంది ఒకటికి బదులు రెండు పాన్ కార్డులను పెట్టుకొని ఉంటారు. ఇలా ఒక వ్యక్తి రెండు పాన్ కార్డులను కలిగే ఉండడం కూడా చట్టపరంగా నేరం. ఈ విధంగా ఎవరైతే రెండు పాన్ కార్డులను కలిగి ఉంటారో అలాంటి వారు ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధానాల్లోనూ పాన్ ని సరెండర్ చెయ్యచ్చు. దీని కోసం మనం ఇన్కమ్ టాక్స్ వెబ్సైట్ కి వెళ్లి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర రెండు ఉంటే ఒక కార్డు డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇన్‌కమ్ టాక్స్ చట్టం, 1961 సెక్షన్ 272బీ ప్రకారం రెండు కార్డ్స్ వుండకూడదు. ఉంటే రూ. 10,000 వరకు జరిమానా కట్టాల్సిన పరిస్థితిలో తలెత్తుతాయి.