ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఎంతో ముఖ్యమైనవి. మనం ఏ ఒక్కప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులు కావాలన్న లేదా మన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు పాన్ కార్డు ఎంతో కీలకంగా మారాయి. అయితే ప్రస్తుతం ఆధార్ కార్డుకు ప్రతి ఒక్క కార్డ్ లింక్ చేయడం జరుగుతుంది మొబైల్ నెంబర్ పాన్ కార్డ్ వంటివన్నీ కూడా ఆధార్ లింక్ చేయాల్సి ఉంది.
ఈ క్రమంలోనే ఇదివరకే ఎన్నోసార్లు మన పాన్ కార్డు అనుసంధానం చేయాలని అధికారులు కూడా తెలియజేశారు. అయితే మార్చి 31 2023వ తేదీలోపు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అండ్ సంధానం చేయాలి లేకపోతే మన పాన్ కార్డ్ వృధాగా మారిపోతుంది.అయితే చాలామంది పాన్ కార్డు ఆధార్ లింక్ చేసి కూడా మర్చిపోయి ఉంటారు మరి పాన్ కార్డు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నవారు ఈ విధంగా మన ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు.
దీని కోసం మొదట మీరు ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ వెబ్ సైట్ www.incometax.gov.in కు వెళ్లాల్సి వుంది.
నెక్స్ట్ ‘లింక్ ఆధార్ స్టేటస్’ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేయగానే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం అయిందో లేదో తెలిసిపోతుంది. ఒకవేళ కాకపోతే వెంటనే లింక్ చేసుకోవాలి. ఇలా గడువులోపు పాన్ కార్డ్ ఆధార్ అనుసంధానం చేయకపోవడంతో మన పాన్ కార్డు వృధాగా మారిపోతుంది.