ఆధార్ కార్డ్ లో మార్పులు, ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం చెల్లించాల్సిన చార్జీల వివరాలు?

ఒక వ్యక్తికి ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనది. ఎందుకంటె ఆధార్ కార్డ్ లో పొందుపరచిన వివరాల ఆధారంగా అన్ని పనులు జరుగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు సంబంధించిన పనులన్నీ ఆధార్ కార్డ్ ఆధారంగానే జరుగుతాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆధార్ కార్డు అప్డేట్ కోసం మీసేవ సెంటర్ వారు ఎంతపడితే అంత డబ్బు వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆధార్ కార్డు అప్డేట్ కోసం చెల్లించాల్సిన చార్జీలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్ణయిస్తుంది.
యుఐడిఏఐ నిబంధనల ప్రకారమే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం రుసుము చెల్లించాలి.

ఈ చార్జీల వివరాలు గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం వల్ల ఆధార్ సెంటర్లో జరిగే మోసాలను అరికట్టవచ్చు. ఇలాంటి కస్టమర్ సర్వీస్ సెంటర్ లో జరిగే మోసాలకు చెక్ పెట్టడానికి ఈ ఆధార్ కార్డు అప్డేట్ చార్జీల వివరాలు తెలుసుకుందాం.

బాల్‌ ఆధార్‌ కార్డు :

పిల్లల ఆధార్ కార్డును బాల్ ఆధార్ అంటారు. ఐదు సంవత్సరాల లోపు వఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. ఇటువంటి పిల్లల ఆధార్ సమాచారం తల్లితండ్రుల ఆధార్ సమాచారంతో ఆధారపడి ఉంటుంది. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల ఆధార కార్డుకి తల్లిదండ్రుల వివరాలు అనుసంధానం చేస్తారు. 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లల 10 చేతి వేళ్లతో పాటు ఐరిస్ పేస్ రికగ్నైజేషన్ అప్డేట్ చేస్తారు. ఇలా అప్డేట్ చేయటం వల్ల పిల్లల వివరాలన్నీ ఒరిజినల్ ఆధార్ లెటర్లో అప్డేట్ అవుతాయి.

1.ఆధార్ సంఖ్య జనరేషన్ (0-5 సంవత్సరాలు) ఉచితం :
ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ కార్డ్ క్రియేట్ చేయటానికి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

2.ఆధార్ సంఖ్య జనరేషన్ (5 ఏళ్లు పైబడిన వారు)ఉచితం :

ఐదేళ్ల నుండి పదిహేను సంవత్సరాల వయసుగల పిల్లల ఆధార్ కార్డు సంఖ్య జనరేట్ చేయటం కోసం ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

3.బయోమెట్రిక్ అప్‌డేట్-ఉచితం:

అలాగే అన్ని వయసుల వారి ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ కూడా ఉచితం.

4.ఇతర బయోమెట్రిక్ అప్‌డేట్‌లు (డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లతో లేదా లేకుండా) రూ.100 :

ఆధార్ కార్డులో డెమోగ్రాఫిక్ అప్డేట్ కోసం వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

5.జనాభా నవీకరణ 50 రూపాయలు:
జనాభా అప్డేట్ కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

6.గుర్తింపు రుజువు లేదా నివాస రుజువులో అప్‌డేట్- 50 రూపాయలు

మన గుర్తింపు లేదా మన నివాస స్థల రుజువును అప్డేట్ చేయటానికి రూ. 50 చెల్లించాలి.

7.elCYC ద్వారా ఆధార్ శోధన-30 రూపాయలు

8.గుర్తింపు లేదా నివాస ధృవీకరణ పత్రం అప్‌డేట్ – 25 రూపాయలు