బ్యాంకు కస్టమర్లు అలర్ట్.. ఈ నెలలో 14 రోజులు మూతపడునున్న బ్యాంక్?

మరి కొన్ని రోజులలో 2022వ సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో ఎంతోమంది వారు చేయాల్సిన కొన్ని పనులను పూర్తి చేసే పనిలో ఉంటారు. ముఖ్యంగా కొన్ని పనులను బ్యాంకులో చేయాల్సి ఉన్నవారు వెంటనే అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డిసెంబర్ నెలలో ఈ ఏడాదికి పూర్తి చేయాల్సిన పనులను చేయడం కోసం ఎంతో మంది బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ నెలలో సెలవులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్లు వెంటనే అలర్ట్ కావాల్సిందని తెలుస్తోంది.

డిసెంబర్ నెలలో ఏకంగా 14 రోజులపాటు బ్యాంకుకు సెలవులు రానున్నాయి. వీటిలో 8 రోజులు సెలవులు కాగా.. మిగిలిన ఆరు రోజులు వీకెండ్ సెలవులు కావడం గమనార్హం మరి ఈ 14 రోజులలో ఏఏ బ్యాంకులు ఎప్పుడు మూతపడునున్నాయనే విషయానికి వస్తే..

డిసెంబర్ 3: Feast of St. Francis Xavier. ఈ కారణంగా పనాజీలో బ్యాంకులు మూసివేయబడుతుంది.

డిసెంబర్ ఐదవ తేదీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అహ్మదాబాద్‌లో బ్యాంకులు బంద్.

డిసెంబర్ 12: Pa-Togan Nengminja Sangma. ఈ కారణంలో షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసి వేయబడుతున్నాయి.

డిసెంబర్ 19: Goa Liberation Day. ఈ కారణంగా పనాజీలో బ్యాంకులకు సెలవు

డిసెంబర్ 26: క్రిస్మస్ నేపథ్యంలో ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లో బ్యాంకులు క్లోజ్

డిసెంబర్ 30: షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేత

డిసెంబర్ 31: న్యూ ఇయర్ నేపథ్యంలో ఐజ్వాల్‌లో బ్యాంకులు క్లోజ్

డిసెంబర్ 10: రెండో శనివారం, డిసెంబర్ 4,11,18,25 వ తేదీలలో ఆదివారం. అదేవిధంగా డిసెంబర్ 24న రెండో శనివారం కావున బ్యాంకులకు సెలవు దినం. ఈ 14 రోజులపాటు బ్యాంకులకు ఆర్బిఐ సెలవు ప్రకటించింది.