దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో రోజు రోజుకి కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పుల వల్ల బ్యాంక్ ఉద్యోగులకి రిలీఫ్ గా ఉంటుంది. కానీ కస్టమర్స్ కి మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇకపై వారంలో బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నట్లు తెలుస్తోంది. సోమవారం నుండి శనివారం వరకు నిరంతరంగా పనిచేసే బ్యాంకులో ఇప్పుడు రెండవ శనివారం నాలుగో శనివారాలలో సెలవు దినాలుగా ప్రకటించారు. ఇక రాబోయే రోజుల్లో వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే బ్యాంకులో తెరుచుకోనున్నాయి.
ఈ ప్రతిపాదన పై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ దీని పైన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకవేళ కనుక ఈ నిర్ణయం అమలులోకి వస్తే ఆర్థిక లావాదేవీలపై అధికంగా ఆధార పడే వ్యక్తులు, సంస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆర్థిక నిపుణులు చెబుతన్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో వారానికి ఐదు రోజుల పని దినాల సంప్రదాయం వుంది. ఇక ఇప్పుడు ఇది బ్యాంకుల వరకు వెళ్లనుంది. వారానికి రెండు వీకాఫ్స్ కావాలని చాలాకాలంగా బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదే గనుక అమలులోకి వస్తే బ్యాంకు ఉద్యోగులు వారానికి 5 రోజులే పని చేసి 2 రోజులు వీకాఫ్ తీసుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఒకవేల ఇలా కనుక జరిగితే ఐదు రోజులు పని గంటలను మరో 50 నిమిషాల వరకు పెంచే ఛాన్స్ వుంది. అయితే శనివారం సెలవు కోసం ప్రతిరోజు 50 నిమిషాల పాటు అదనంగా పనిచేయటానికి ఉద్యోగులు కూడా సిద్ధం గానే ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బ్యాంకులలో ఈ కొత్త మార్పు రానుంది. అప్పుడు ఉద్యోగులు వారానికి 5 రోజులే పని చేసి 2 రోజులు వీకాఫ్ తీసుకోవచ్చు.