ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. లక్ష పెడితే రూ.2 లక్షలు పొందే ఛాన్స్!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కీలక ప్రకటనలు వెలువడుతున్నాయి. లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షల రూపాయలు పొందే అవకాశాన్ని ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కల్పిస్తుండటం గమనార్హం. రిస్క్ లేకుండా భారీ రాబడి పొందాలని భావించే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

సీనియర్ సిటిజన్లకు ఈ రెండు బ్యాంక్స్ మంచి వడ్డీ రేటును అందిస్తుండటం గమనార్హం. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో కూడా మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 6.25 శాతం వడ్డీ లభిస్తుండగా మూడు సంవత్సరాల టెన్యూర్ పై 7 శాతం వడ్డీ ఉంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేవలం మూడేళ్ల కాలంలో 24,000 రూపాయలు వడ్డీ రూపంలో పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఐదేళ్ల టెన్యూర్ ను ఎంచుకుంటే వడ్డీ రూపంలో ఏకంగా 45,000 రూపాయలు పొందే ఛాన్స్ ఉంటుంది. పదేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇనెస్ట్ చేస్తే లక్ష రూపాయలకు మరో లక్ష రూపాయలు పొందవచ్చు. డిపాజిట్ చేసే మొత్తం పెరిగే కొద్దీ పొందే మొత్తం కూడా రెట్టింపు కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో లక్ష డిపాజిట్ చేస్తే 7.1 శాతం వడ్డీ పొందే అవకాశం అయితే ఉంటుంది.

పోస్టాఫీస్ స్కీమ్స్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో వడ్డీని అందిస్తున్నాయి. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్స్ గురించి పూర్తిగా తెలుసుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది.