బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్… మార్చి నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..?

ప్రస్తుత కాలంలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ఆన్లైన్ చెల్లింపులు జరుగుతున్నప్పటికీ మరి కొంతమంది ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లి వారి ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ మేరకు బ్యాంకులకు సెలవులు ఉన్న రోజులలో కస్టమర్లు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వారికి అలర్ట్.. ఎందుకంటె మార్చి నెలలో 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుపుకోవాలని భావించేవారు ముందే జాగ్రత్త పడటం తప్పనిసరి.

ఇక కొన్ని ప్రత్యేక రోజుల సందర్భంగా అన్ని రాష్ట్రాలలో కలిపి మొత్తం 12 రోజులపాటు మార్చి నెలలో బ్యాంకులో సెలవు ప్రకటించాయి. మార్చి 2023 నెలలో ఏ ఏ రాష్ట్రాలలో ఏయే రోజులలో బ్యాంకులు సెలవు ప్రకటించనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

• మార్చి 3: మార్చి 3 శుక్రవారం నాడు చప్చార్ కుట్ సందర్భంగా మణిపూర్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
• మార్చి 5: ఆదివారం కనుక అన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు.
• మార్చి 7: మంగళవారం నాడు హోలీ. హోలికా, దహన్, ధులాండి, దోల్ జాత్రా పేర్లతో వివిధ రాష్ట్రాలో ఈ పండుగని జరుపుతారు. హోలీ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు క్లోజ్.
• మార్చి 8: ధులేటి, దొల్యాత్రా, హోలీ, యాసాంగ్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకి సెలవు ప్రకటించారు.
• మార్చి 9: మర్చి 9 న బిహార్‌లో హోలీ వేడుకలు చేసుకుంటారు.అందువల్ల ఆ రోజున బిహార్ రాష్ట్రంలో బ్యాంకులు బంద్.
• మార్చి 11: మార్చి 11 రెండవ శనివారం.దేశవయప్తంగా అన్ని రాష్ట్రాలలో బ్యాంకులు బంద్.
• మార్చి 12: ఇక మార్చి 12 ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్.
• మార్చి 19: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్.
• మార్చి 22: ఉగాది, బిహార్ దివాస్, తెలుగు కొత్త సంవత్సరం పండగలు సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
• మార్చి 25: నాల్గవ శనివారం బ్యాంకులు బంద్.
• మార్చి 26: ఆదివారం అన్ని బ్యాంకులు క్లోజ్ ఏ.
• మార్చి 30: శ్రీరామ నవమి కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.