ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వల్ల ప్రతి ఒక్కటి ఆన్లైన్ అయ్యింది. గతంలో ఆర్థిక లావాదేవీలు జరపటానికి తప్పనిసరిగా బ్యాంకు కి వెళ్లాల్సి ఉండేది. అయితే ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది . దీంతో బ్యాంకులతో పని లేకుండా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా ఆర్థిక లావాదేవీలను జరుపుతున్నారు. సాధారణంగా లోన్ తీసుకోవాలనుకునేవారు బ్యాంకుకు వెళ్లి అందుకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేసి లోన్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ ద్వారా లోన్ కి అప్లై చేయవచ్చు. మీ మొబైల్ లో ఉన్న ఫోన్ పే ద్వారా చాలా సులభంగా లోన్ అప్లై చేయవచ్చు.
ఫోన్ పే తన వినియోగదారుల కోసం ఇప్పటికీ ఎన్నో రకాల ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోన్ పే ద్వారా ఒక బ్యాంకు అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్ కి డబ్బు సెండ్ చేయవచ్చు. అలాగే ఈ ఫోన్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ షాపింగ్ కి సంబంధించిన బిల్లులు సులభంగా పే చేయవచ్చు. అయితే ఇప్పుడు ఫోన్ పే ద్వారా లోన్ కి అప్లై చేసుకుని అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే ఫోన్ పే డైరెక్టుగా రుణాలు ఇవ్వదు. ఇతర సంస్థలతో భాగస్వామ్యం ద్వారా లోన్ సదుపాయం అందిస్తోది. మీరు ఫోన్ పే ద్వారా మనీ వ్యూ, బడ్డీ లోన్ వంటి సంస్థల నుండి మీరు లోన్ ను పొందవచ్చు..
ఎలా అప్లై చేసుకోవాలి :
• ఫోన్ పే ద్వారా లోనికి అప్లై చేయడానికి ముందుగా ఫోన్ పే యాప్ లోకి వెళ్లాలి.
• అక్కడ మీకు పైన బ్యానర్ లో మనీ వ్యూ లేదా బడ్డీ లోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
• సెలక్ట్ చేసుకుని దానిపై క్లిక్ చేస్తే న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. దీంతో మీరు బడ్డి లోన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
• ఆ తర్వాత యాప్ లోకి లాగిన్ అయి మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, జాబ్ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
• వివరాలన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు లోన్ అర్హత ఉందా లేదా అనేది తెలుస్తుంది.
• మీకు ఎలిజిబిలిటి ఉంటే వెంటనే రూ.5లక్షలు లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది..సిబిల్ స్కోర్ బాగుంటే వెంటనే రుణం పొందవచ్చు.