ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించినవారు లేరు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని ఇంటి నుండి బయటకు వెళ్లకుండా మనిషి తన అవసరాలు అన్ని తీర్చుకుంటున్నాడు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మనిషికి ఎంత ఉపయోగం ఉంటుందో అంత నష్టం కూడా ఉంటుంది. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి కొత్త కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ మొబైల్స్ తయారు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని కొంతమంది మంచి పనులకు ఉపయోగిస్తుంటే మరి కొంతమంది ఈ టెక్నాలజీని అడ్డుపెట్టుకొని నేరాలకు పాల్పడుతున్నారు.
మొబైల్ ఫోన్లో ఉండే కొన్ని రకాల యాప్స్ అప్లికేషన్స్, బేస్ చేసుకునే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లలో మాల్‌వేర్ పంపించి, అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా 203 ప్రమాదకరమైన ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌ను గుర్తించారు . థాయిలాండ్ మినిస్ట్రీ ఆఫ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ యాప్‌లను గుర్తించగా.. వీటిని వెంటనే తొలగించాలంటూ గూగుల్, యాపిల్‌ను కోరాయి. అందువల్ల ఈ యాప్స్ మీ మొబైల్ లో ఉంటే వెంటనే తొలగించాలి.
మీ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రమాదకరమైన యాప్ ఇవే.
Beauty filter, Blood pressure checker, Caller theme, Creative emoji keyboard, Poco launcher, 4K Pro Camera, Beat Maker Pro, Art Filters, Blue Scanner, Chat SMS, Cool Messages, Easy PDF Scanner, Frames, Funny Caller, Hi Text SMS, Midget Pro, Menu Maker, Paper Doc Scanner వంటి యాప్స్ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రమాదకరమైన యాప్స్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు, మీ వ్యక్తిగత డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.