ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చేతిలో స్మార్ట్ ఫోన్ మనకు కనబడుతూనే ఉంటుంది అయితే స్మార్ట్ ఫోన్ ఉండడంతో చిన్న పిల్లలు వారికి తెలియకుండా వారికి నచ్చినటువంటి యాప్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల ఆప్స్ మన ఫోన్లో ఉండటం వల్ల కొన్నిసార్లు మన ఫోన్ హ్యాంగ్ అవ్వడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్‌లు, పేమెంట్ యాప్‌లు, ఎడిటింగ్ యాప్‌లు ఇలా ఎన్నో యాప్ లు గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా లభ్యమవుతాయి. అయితే, వీటిలో కొన్ని యాప్‌లు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని రకాల యాప్స్ ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌ను క్యాప్చర్ చేసి, ఆ వ్యక్తి గత సమాచారాన్ని దొంగలిస్తారు. ఇలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న కొన్ని హానికరమైన యాప్ లను థాయ్ ల్యాండ్ కి చెందిన డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కనుగొంది. మరి మీ ఫోన్లో కనుక ఈ యాప్స్ కనుక ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేసేయండి. మరి ఆ యాప్స్ ఏంటి అనే విషయానికి వస్తే…
మీ ఫోన్ లో కనుక బీట్ మేకర్ ప్రో, బ్యూటీ ఫిల్టర్, బ్లడ్ ప్రెషర్ చెక్, బ్లడ్ ప్రెషర్ డైరీ, బ్లూ స్కానర్, బ్లర్ ఇమేజ్, కాలర్ థీమ్, కాల్ మీ ఫోన్ థీమ్స్, కాల్ స్కిన్స్, కెమెరా ట్రాన్స్ లేటర్, కేర్ మెస్సేజ్, కార్టూన్స్ మీ, క్యాచీ క్లియర్, చాట్ ఆన్ లైన్, చాట్ ఎస్ఎంఎస్, చాట్ టెక్ట్స్ ఎస్ఎంఎస్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డ్, క్లాసిక్ గేమ్ మెసెంజర్, కోకో కెమెరా, ఎమోజీ థీమ్ కీబోర్డ్
4కే ప్రో కెమెరా, 4కే వాల్ పేపర్స్ ఆటో ఛార్జర్, అడ్వాన్స్డ్ ఎస్ఎంఎస్, ఐపిక్ – మ్యాజిక్ ఫోటో ఎడిటర్, అల్ గుడ్ పీడీఎఫ్ స్కానర్, ఆర్ట్ ఫిల్టర్స్, ఆస్ట్రో + హోరోస్కోప్, ఆస్ట్రోలైన్: డైలీ హోరోస్కోప్, ఆటో స్టిక్కర్ మేకర్ స్టూడియో వంటి యాప్స్ కనుక ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయండి.