ఇయర్ ఎండింగ్ లో ట్రిప్ కి ప్లాన్ చేస్తున్నారా.. ఈ క్రెడిట్ కార్డ్ బెస్ట్ బెనిఫిట్స్ పొందవచ్చు?

ఉదయం లేచిన దగ్గర నుండి ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడిన ప్రజలు అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వటానికి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా తరచూ టూర్స్‌కు వెళ్లేవారు, ఖర్చులను తగ్గించటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే టూర్లు, ట్రావెలింగ్ ఇష్టపడే వారి కోసం కొన్ని బ్యాంకులు ట్రావెల్ క్రెడిట్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా టికెట్ బుకింగ్స్‌ టైమ్‌లో డిస్కౌంట్, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, పార్ట్నర్‌షిప్ బ్రాండ్ బెనిఫిట్స్, ఇతర డీల్స్ పొందవచ్చు. ఇలా ఖర్చు తగ్గించే క్రెడిట్ కార్డు వివరాల గురించి తెలుసుకుందాం.

1. ఎస్బీఐ, ఎయిర్‌ఇండియా కార్డ్

తరచూ ట్రావెలింగ్ కి వెళ్లేవారి కోసం ఎస్బీఐ, ఎయిర్‌ఇండియా స్టేట్‌ బ్యాంక్, ఎయిర్‌ ఇండియా ఎస్‌బీఐ సిగ్నెచర్‌ క్రెడిట్‌ కార్డులను అందిస్తోంది. దీని ద్వారా ఎయిర్ ఇండియా పోర్టల్స్, యాప్ ద్వారా బుక్ చేసిన ఎయిర్ ఇండియా టిక్కెట్లపై ప్రతి రూ.100కి 30 రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. దీనికి యాన్యువల్ ఫీజు రూ.4,999 చెల్లించాలి. ఈ కార్డుపై ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్-ఫ్లయింగ్ రిటర్న్స్ కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్ లభిస్తుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ ప్రయారిటీ పాస్ ప్రోగ్రామ్ ద్వారా 600కి పైగా ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లకు యాక్సెస్‌ లభిస్తుంది. కార్డ్ హోల్డర్ భారతదేశంలోని దేశీయ వీసా లాంజ్‌లకు సంవత్సరానికి ఎనిమిది కాంప్లిమెంటరీ విజిట్స్ పొందవచ్చు.

2. యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ (Axis Vistara Signature) పేరుతో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంది. దీని ద్వారా కస్టమర్లకు కాంప్లిమెంటరీ క్లబ్ విస్తారా సిల్వర్ మెంబర్‌షిప్ అందిస్తుంది. సూచించిన మొత్తాన్ని ఖర్చు చేసిన వారికి నాలుగు కాంప్లిమెంటరీ ప్రీమియం ఎకానమీ టిక్కెట్లను అందిస్తుంది. ఖర్చు చేసిన ప్రతి రూ.200కి నాలుగు క్లబ్ విస్తారా పాయింట్లను కూడా అందిస్తుంది. కార్డ్ హోల్డర్ భారతదేశంలోని ఎంపిక చేసిన విమానాశ్రయాలలో రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ కార్డుకు యాన్యువల్ పీజుగా రూ.3,000 చెల్లించాలి.

3. ఎస్బీఐ, ఐఆర్‌సీటీసీ కార్డు

ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ కార్డ్‌ ప్రీమియర్‌ కార్డ్ పేరుతో లభించే ఈ క్రెడిట్‌ కార్డ్ ‌ద్వారా రైల్వే టిక్కెట్ బుకింగ్‌పై ఒక శాతం, ఎయిర్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌పై 1.8 శాతం బెనిఫిట్ పొందవచ్చు. IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా AC కోచ్‌లు, చైర్ కార్‌లలో టిక్కెట్‌ బుక్ చేస్తే.. కార్డ్ హోల్డర్ 10 శాతం వాల్యూను తిరిగి రివార్డ్ పాయింట్లుగా పొందవచ్చు. సంవత్సరానికి ఎనిమిది దేశీయ రైల్వే లాంజ్ యాక్సెస్‌లను కూడా పొందవచ్చు. ఇక క్రెడిట్ కార్డు యన్యువల్ ఫీజు రూ. 1,499 చెల్లించాల్సి ఉంటుంది.