సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అందువల్ల రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగానే రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటుంది. అలా వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా వెయిటింగ్ లిస్టులో ఉన్న మీ టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ద్వారా రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవటమే కాకుండా వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయో మీరు ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు. టిక్కెట్ బుకింగ్ నుంచి రైలు అప్‌డేట్‌ల దాకా మీరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రైల్వే సౌకర్యాలు చాలా వరకు ఆన్‌లైన్‌లో ఉంటున్నాయి. వినియోగదారుల కోసం ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ పరిమితిని ఒక నెల లో రెట్టింపు చేసింది. IRCTC IDతో మీ ఆధార్ ని లింక్ చేస్తే నెలలో 24 టిక్కెట్‌లను బుక్ చెయ్యచ్చు.
వెయిటింగ్ లిస్టులో ఉన్న మీ టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలుసుకోవడానికి PNR నెంబర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీ టిక్కెట్‌ను నిర్ధారించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఈజీగా మీరు తెలుసుకోవచ్చు.
• వెయిటింగ్ లిస్టులో ఉన్న మీ టికెట్ కి సంబంధించిన వివరాలు గురించి తెలుసుకోవటానికి ముందుగా IRCTC వెబ్‌సైట్ కి వెళ్లండి.
• ఆ తరవాత మీ ID, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వండి.
• ఇప్పుడు ఓ పేజీ ఓపెన్ అవుతుంది. PNR నంబర్‌ను నమోదు చేసి స్టేటస్ ని పొందొచ్చు.
• ఇక ఇప్పుడు నిర్ధారణ అవకాశాలను పొందేందుకు మీరు ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్త పాప్-అప్ విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఈజీగా మీరు మీ టిక్కెట్‌ను కన్ఫర్మేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.