ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మారిపోయింది. విద్యార్థుల నుండి వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరూ కూడా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. గతంలో క్రెడిట్ కార్డు కోసం కొంతవరకు రుసుము చెల్లించాల్సి వచ్చేది కానీ ప్రస్తుతం కొన్ని బ్యాంకింగ్ సంస్థలు ఉచితంగానే క్రెడిట్ కార్డు ని అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఫ్రీగా క్రెడిట్ కార్డులను అందజేస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొంతకాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఇటీవల ఒక బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు ఎవరైనా ఉచితంగా క్రెడిట్ కార్డ్ పొందాలనుకుంటే ఇదే సరైన సమయం. యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే తన కస్టమర్ల కోసం ఎన్నో స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చి సేవలు అందిస్తోంది. ఇక తాజాగా ఈ ఫ్రీ క్రెడిట్ కార్డు స్కీమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫ్రీ క్రెడిట్ కార్డు కోసం యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు కొన్ని ఎంపిక చేసిన ఛానల్స్ ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఇలా చానల్స్ ద్వారా అప్లై చేసిన వాళ్ళకే ఈ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఆఫర్ ని ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు పైన ఈ ఆఫర్స్ వున్నాయి.
అంటే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే క్రెడిట్ కార్డు ఉపయోగించిన తర్వాత నెలవారి బిల్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ క్రెడిట్ కార్డు తో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ని ఫ్రీ గా పొందటమే కాకుండా ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేస్తే 100 శాతం డిస్కౌంట్ కూడా వస్తుంది. అయితే పేటీఎం మూవీస్ ద్వారా టికెట్లు బుక్ చేసినప్పుడే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే సోనీలివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు మీకు వస్తుంది. అలానే స్విగ్గీ ఆర్డర్ల పై 40 శాతం తగ్గింపు ఉంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ క్రెడిట్ కార్డు ద్వారా ఏడాదిలో రూ. 15 వేల వరకు డబ్బు ఆదా చేయవచ్చు. కేవలం యాక్సిస్ బ్యాంక్ మాత్రమే కాదు ఇతర బ్యాంకులు కూడా ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్‌ను అందుబాటులో ఉంచాయి. అయితే ఈ ఆఫర్ పరిమితి కొంతకాలం మాత్రమె ఉంటుంది.