వాట్సాప్ వినియోగదారులకు మరొక శుభవార్త.. ఇకపై పాత మెసేజ్ లు వెతకడం మరింత సులభం..?

స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ వాట్స్అప్ వినియోగిస్తున్నారు. ఎన్నో రకాల మెసేజ్ ఆప్ లు మార్కెట్లో ఉన్నప్పటికీ వాట్సప్ మెసేజ్ యాప్ కి మాత్రం క్రేజ్ తగ్గటం లేదు. ఎందుకంటే ఈ మెసేజ్ యాప్ ద్వారా యూజర్స్ కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాట్సప్ ద్వారా చాట్ చేయడమే కాకుండా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, ఫైల్స్ షేరింగ్ ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వాట్స్అప్ ని తప్పకుండా వినియోగిస్తున్నారు.

సాధారణంగా చాట్‌ బాక్స్‌లో చాలా కాలం క్రితం చాట్ చేసిన పాత మెసేజ్‌లను వెతకడం చాలా కష్టమైన పని. అయితే పాత మెసేజ్లను వెతకటం కోసం సెర్చ్‌ ఆప్షన్‌లో సదరు మెసేజ్‌ను టైప్‌ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో ఆ మెసేజ్లను మర్చిపోవటం లేదా కొన్ని సందర్భాల్లో సెర్చ్ బాక్స్ లో టైప్ చేసినా రిజల్ట్‌ అంత సులభంగా రాదు. అయితే ఈ క్రమంలో తాజాగా వాట్సాప్‌ ‘సెర్చ్‌ బై డేట్‌’ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పాత మెసేజ్‌లను తేదీల వారీగా తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్ iOS స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త 23.1.75 అప్‌డేట్‌తో అందుబాటులో ఉంది. మిగతా యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తాజాగా వాట్సాప్ ప్రవేశపెట్టిన ‘సెర్చ్‌ బై డేట్‌’ అనే ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు.. ముందుగా వాట్సాప్‌ చాట్‌లో సెర్చ్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ క్యాలెండర్‌ సింబల్‌ కనిపిస్తుంది. క్యాలెండర్‌లో మీకు కావాల్సిన తేదీ, నెల, సంవత్సరం సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఎంటర్‌ నొక్కితే వెంటనే ఆ రోజు మీకు వచ్చిన మెసేజ్‌లు మీ మొబైల్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఇలా పాత మెసేజ్ లను వెతకటానికి ఎక్కువ కష్టపడకుండా ‘సెర్చ్‌ బై డేట్‌’ అనే ఫీచర్ ద్వారా చాలా సులభంగా సెర్చ్ చేయవచ్చు.