వాట్సాప్ యూజర్లకు మరొక గుడ్ న్యూస్.. గూగుల్ డ్రైవ్ అవసరం లేకుండా సరికొత్త ఫీచర్?

ప్రముఖ మెసేజింగ్ ఆప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకుని వస్తూ యూజర్లను బాగా ఆకట్టుకుంటుంది. వాట్సాప్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న వాట్సాప్ తాజాగా సరికొత్త టీచర్ ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించి వినియోగదారులకు శుభవార్త తెలియజేసింది. వాట్సాప్ లో చాట్ ట్రాన్స్పరెంట్ పేరుతో మరొక కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ వల్ల ఆండ్రాయిడ్ డివైజ్‌ నుంచి వచ్చిన డేటాను మరో లోకల్‌ నెట్‌వర్క్‌తో పని చేస్తున్న డివైజ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది.ఇక టెస్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వాట్సప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అలాగే వాట్సాప్‌ బీటా ఇన్ఫో వర్గాల ప్రకారం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్ ద్వారా యూజర్లు తమ ఛాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇకపై డిలీట్ అయిన వాట్సాప్‌ చాట్‌ను బ్యాకప్‌ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్‌ వాడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఒక డివైజ్ నుంచి మరో డివైజ్‌కు ఛాట్ ట్రాన్స్‌ఫర్ చేయటానికి బ్యాకప్ కోసం క్లౌడ్ సర్వీసులకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

వాట్సాప్ ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ సరికొత్త ఫీచర్ వల్ల వాట్సప్ యూజర్లు చాలా సులభంగా తమ డేటాను బ్యాకప్‌ పొందొచ్చు. ఇక గతంలో వాట్సాప్‌ ప్రాక్సీ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ నిర్ణయంతో ఏ సమయంలో అయినా వాట్సాప్‌ కనెక్షన్‌ బ్లాక్‌ అయితే, తిరిగి వాట్సప్ కనెక్షన్ పొందటానికి ఈ ఫీచర్ ద్వారా అవకాశం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా పలు రకాల సర్వర్ల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని కమ్యూనికేట్ చేసుందుకు ఈ ప్రాక్సీ ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం అందుబాటులోకి తీసుకురానున్న ఈ చాట్ ట్రాన్స్పరెంట్ వల్ల వాట్సాప్ యూసర్లు గూగుల్ డ్రైవ్ అవసరం లేకుండా తమ డేటా బ్యాకప్ పొందవచ్చు.