వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్… ఇకపై ఫోటోను స్టిక్కర్ గా మార్చేయొచ్చు?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.కొంతమంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు వాట్సాప్ లో తమ స్నేహితులు బంధుమిత్రులతో వీడియో కాల్స్ చాటింగ్ అంటూ సమయం గడుపుతూనే ఉంటారు.ఇలా రోజురోజుకు వాట్స్అప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవడంతో వినియోగదారుల కోసం వాట్సాప్ తరచూ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది.

వాట్సాప్ సంస్థ 2018 లో స్టిక్కర్ సపోర్ట్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాట్సాప్‌ యూజర్ల కోసం రెండు ఫస్ట్ పార్టీ స్టిక్కర్స్‌ ప్యాక్‌లను తీసుకొచ్చింది. వాట్సాప్‌లోని మార్పులను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo వివరాల మేరకు.. వాట్సాప్‌ నిశ్శబ్దంగా iOS వెర్షన్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించనున్నట్లు తెలియజేసింది. వినియోగదారులు ఎటువంటి థర్డ్‌ పార్టీ యాప్ అవసరం లేకుండా త్వరగా వాట్సాప్‌ స్టిక్కర్‌లుగా మార్చడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.

ఈ విధంగా వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినటువంటి ఈ ఫీచర్ కేవలం ఐఫోన్‌ వెర్షన్ 23.3.77తో అందుబాటులో ఉంది. ఇప్పుడు వినియోగదారులు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.మరి ఈ యాప్ ఎలా పనిచేస్తుంది దీని ద్వారా వినియోగదారులకు ఏంటి ప్రయోజనం అనే విషయానికి వస్తే…వినియోగదారులు తమ ఐఫోన్ ఆల్బమ్ నుంచి ఫోటోను సెలక్ట్‌ చేసుకుని, వాట్సాప్ స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్‌ అంత సులువు కాదు. కస్టమ్ స్టిక్కర్‌ల కోసం వాట్సాప్ కచ్చితంగా నిర్దిష్ట ఆప్షన్‌ను యాడ్‌ చేయలేదు.

ఇందుకోసం ముందుగా ఐఫోన్‌లో ఫోటోస్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి. మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫోటో నుంచి సబ్జెక్ట్‌ను వేరు చేయడానికి ఫోటోపై ట్యాప్‌ చేసి హోల్డ్‌ చేసి ఉంచండి. ఇప్పుడు ఏదైనా వాట్సాప్‌ కన్వర్జేషన్‌లోకి సబ్జెక్ట్‌ని డ్రాగ్‌ చేసి డ్రాప్‌ చేయండి. ఈ ప్రాసెస్‌ అయిన తర్వాత.. ఈ ఇమేజ్‌ను స్టిక్కర్‌గా మార్చాలనుకుంటున్నారా? అని వాట్సాప్ అడుగుతుంది. స్టిక్కర్‌ని క్రియేట్‌ చేసిన తర్వాత, అది వాట్సాప్‌ స్టిక్కర్‌ కలెక్షన్‌లో ఉంటుంది. ఇతర వాట్సాప్‌ కన్వర్జేషన్‌లకు మళ్లీ ఉపయోగించుకోవచ్చు.