పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగ ఖాళీలు.. కియో మోటార్స్ తో పాటు ఆ సంస్థల్లో?

దేశంలో సంవత్సరాలు గడిచే కొద్దీ నిరుద్యోగ యువత శాతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిప్రయత్నాలు చేసినా ఈ సమస్యకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్లు వెలువడుతూ నిరుద్యోగులకు బెనిఫిట్ కలిగిస్తున్నాయి. కియా మోటార్స్ తో పాటు పలు సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.

ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నెల 23వ తేదీన ఒక జాబ్ మేళాను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ జాబ్ మేళా ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధం కావడం గమనార్హం. నవ భారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థతో పాటు ఎం.ఐటీ టెక్నాలజీస్ ఈ జాబ్ మేళాలో పాల్గొననుందని సమాచారం అందుతోంది. మడకశిరలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం.

ఎంటీ టెక్నాలజీస్ 50 ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధం కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 25,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. కనీసం పది అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటారు. కియా ఇండియా సంస్థలో నీమ్ ట్రైనీ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 16,000 రూపాయల రేంజ్ లో వేతనం లభించనుందని తెలుస్తోంది.

నవ భారత్ ఫర్టిలైజర్స్ లో 50 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 12,000 రూపాయల వేతనం లభించనుంది. ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ట్విట్టర్ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు.