వాట్సప్ లో సరికొత్త ఫీచర్… ఇకపై ఫేక్ కాల్స్ కి చెక్..?

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ తప్పనిసరిగా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకి వాట్స్అప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోవటంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాల నిమిత్తం కొత్త కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది.ఇప్పటికే మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ చాట్, మీటింగ్స్ వంటి ఎన్నో ఫీచర్స్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీనిలో బిజినెస్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అయితే దీని వల్ల ఉన్న లాభాలతో పాటుగా.. యూజర్లకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

ముఖ్యమైనది స్పామ్ కాల్స్‌. వాట్సాప్ లో కూడా మనకు తెలియని నంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. దానిని అందిపుచ్చుకుని కేటుగాళ్లు కాల్స్ కోసం వాట్సాప్ ని వాడేస్తున్నారు. ఈ స్పామ్ కాల్స్ ద్వారా యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్పామ్ కాల్స్ విషయంలో వాట్సాప్ కు ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంపై వాట్సాప్ చాలా సీరియస్ యాక్షన్స్ కు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి స్కామ్/స్పామ్ కాల్స్ ని అరికట్టేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ ఫీచర్ ద్వారా మీరు వద్దు అనుకుంటే మీకు ఎలాంటి అనౌన్ నంబర్స్ నుంచి కాల్స్‌ రావు. అయితే అనౌన్ నంబర్ నుంచి మెసేజ్ లు మాత్రం వస్తాయి. ఫలానా నంబర్ నుంచి మెసేజ్ వస్తే.. యూజర్ కు నచ్చితే తిరిగి కాల్ చేయడం, లేదా ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వడం చేయచ్చు. ఒకవేళ అన్నోన్ నెంబర్ నుండి కాల్స్ వచ్చినా కూడా మనకు కాల్ వచ్చినట్లు మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలెప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. సెలక్టివ్ ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ వాట్సాప్ న్యూ ఫీచర్ని టెస్ట్ చేసే అవకాశం కల్పించారు. వాట్సాప్ తీసుకురాబోతున్న ఈ ఫీచర్ వల్ల స్పామ్ కాల్స్ ని అరికట్టటానికి వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.