మనలో చాలామంది డబ్బును పొదుపు చేయడానికి వేర్వేరు మార్గాలను అన్వేషిస్తారనే సంగతి తెలిసిందే. అయితే దీర్ఘకాలంలో డబ్బులను పొదుపు చేయాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి. నెలకు కేవలం 5000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో 2.5 కోట్ల రూపాయలు వస్తాయి.
క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్లను నిర్వహించడం వల్ల ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే మాత్రం ఇందులో రిస్క్ అనేది ఒకింత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. 5000 రూపాయలతో సిప్ మొదలుపెట్టి ఏడాదికి 5 శాతం సిప్ మొత్తాన్ని పెంచడం ద్వారా 12 శాతం రిటర్న్స్ వస్తే 30 సంవత్సరాల తర్వాత 2.63 కోట్ల రూపాయల కార్పస్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
సిప్ మొత్తం ఎంత పెరిగితే పొందే మొత్తం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాని వాళ్లకు మాత్రం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే మంచి లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకింత రిస్కీ అని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.
ఎక్కువ మొత్తంలో ఆదాయం ఉన్నవారు సిప్ కు బదులుగా లంప్సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్లు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా కచ్చితంగా మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి.