నాగపూర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా మొక్కవోని స్థైర్యంతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ తన వన్డే కెరీర్ లో 40 వ సెంచరీని సాధించాడు. పాయింట్ మీదుగా చూడచక్కని బౌండరీతో శతకాన్ని పూర్తి చేశాడు.
అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ గా వెనుదిరిగడు. ఆ తర్వాత ధావన్ 21, రాయుడు 18 కూడా నిరాశ పరిచారు. ఈ సమయంలో కోహ్లీకి అండగా నిలిచిన విజయ్ శంకర్ 46 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అనంతరం జాధవ్ 11, ధోనీ పరుగులేమీ చేయకుండానే ఔట్ అయ్యారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ప్రస్తుతం 110 బంతుల్లో 105 పరుగులతో (9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. జడేజా 15 పరుగులతో ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లలో జంపా 2 వికెట్లు తీయగా, కమిన్స్, మ్యాక్స్ వెల్, లియోన్ లు చెరో వికెట్ తీశారు. భారత్ 47 ఓవర్లకు 248 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 116 పరుగుల వద్ద ఔటయ్యాడు.