ఆస్ట్రేలియా గడ్డపై విజయదుందుభి మోగించాలని వచ్చిన భారత్‌కు నిరాశే ఎదురైంది. తొలి రెండు వన్డేలలో దారుణంగా పరాజయం పాలైన ఇండియా మూడో వన్డేలో అతికష్టం మీద 13 పరుగుల తేడాతో గెలిచి పరువు నిలపుకుంది. మ్యాక్స్‌వెల్ వీరవిహారం చేయడంతో ఒక దశలో ఆస్ట్రేలియా సులువుగా గెలుస్తుందని అనుకున్నా బుమ్రా, శార్ధూల్ మంచి బ్రేక్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 302 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5×4, 3×6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: 78 బంతుల్లో 5×4) హాఫ్ సెంచరీలు బాదడంతో మంచి స్కోరు సాధించింది.
ఈ సిరీస్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (16: 27 బంతుల్లో 2×4) మరో సారి నిరాశ పరిచాడు. కొత్త ఓపెనర్ శుభమన్ గిల్ (33: 39 బంతుల్లో 3×4, 1×6) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు . ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (19: 21 బంతుల్లో 2×4), కేఎల్ రాహుల్ (5: 11 బంతుల్లో) కూడా తేలిపోయారు. కోహ్లీ, జడ్డూ, పాండ్యాల పోరాటంతో గౌరవప్రదమైన స్కోరు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అస్గన్ అగర్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపాకి తలో వికెట్ దక్కింది.
303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మొదటి నుండి మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఓపెనర్ లాబుషేన్ (7), స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22), త్వరగానే వెనుదిరిగిన కెప్టెన్ ఫించ్ (75) ఆడుతూ పాడుతూ ఆడాడు. ఈ క్రమంలో అతనికి అనేక లైఫ్‌లు కూడా వచ్చాయి. అయితే టాప్ ఫామ్‌లో ఉన్న ఫించ్‌ను జడేజా ఔట్ చేశాడు. ఇక గ్రీన్ (21), క్యారీ (38) పరుగులు చేసి ఔటయ్యారు. ఫుల్ ఫామ్‌లో ఉన్న మ్యాక్స్ వెల్(38 బంతుల్లో 59) గేమ్‌ని గెలిపిస్తాడని అనుకుంటున్న తరుణంలో బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. అనంతరం అగర్(28), అబాట్ (4) కాసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. జంపా( 4), హెజిల్‌వుడ్(7) పరుగులు చేశారు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ 10 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 289 పరుగులు చేసింది.
మొత్తానికి చివరి మ్యాచ్‌లో గెలిచిన భారత్ కు కాస్త ఉపశమనం లభించింది. ఈ ఉత్సాహంతో టీ 20 బరిలోకి దిగనున్నారు.
భారత్ బౌలర్స్ లో శార్ధూల్ ఠాకూర్ మూడు వికెట్లు పడగొట్టగా, నటరాజన్ ,బుమ్రా రెండు ,జడేజా,కుల్దీప్ చెరో వికెట్ తీసారు. ఇక డిసెంబర్ 4న తొలి టీ 20 జరగనుంది.హార్ధిక్ పాండ్యా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ స్మిత్ అందుకున్నారు