మెల్ బోర్న్ వన్డేలో మెరిసిన భారత్, వన్డే సిరిస్ కైవసం

ఆస్ట్రేలియా గడ్డ పై భారత్ మరో చరిత్ర సృష్టించింది. 71 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరిస్ ట్రోఫిని గెలిచి చరిత్ర సృష్టించి భారత క్రికెట్ జట్టు తాజగా ఆసీస్ గడ్డ పై ద్వైపాక్షిక వన్డే సిరిస్ గెలిచింది. మూడు వన్టేల సిరిస్ ను 2-1 తో కైవసం చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది. 87 పరుగులతో ధోని నాటౌట్ గా నిలిచారు. ధోనికి కేదార్ జాదవ్ చక్కని సహకారం అందిస్తూ 61 పరుగులు చేశారు. ఆరు వికెట్లు తీసి ఆసీస్ ను కట్టడి చేసిన స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాన్ ఆఫ్ ది సిరిస్ ధోనికి దక్కింది.