తన కెరియర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న సానియా… వీడియో వైరల్!

మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్- 2023 ఫైనల్‌ పోరులో సానియా-బోపన్న జోడి పరాజయం పాలైంది.
18ఏళ్ల గ్రాండ్‌ స్లామ్‌ కెరీర్‌ను ముగించాలనుకున్న సానియా ఆశలపై బ్రెజిల్‌ జోడి నీళ్లు చల్లింది.టైటిల్ పోరులో సానియా-బోపన్న జోడీ వరుస సెట్లలో ఓడిపోయింది. 7-6(2), 6-2 తేడాతో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రఫెల్ మాటోస్ చేతిలో ఓడిపోయింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ ముగించిన సానియా వచ్చే నెలలో జరగనున్న దుబాయ్‌ ఓపెన్‌లో ఆడనుంది.

ఇలా ఫిబ్రవరి నెలలో దుబాయిలో జరగనున్న టోర్నమెంట్ సానియాకు ఆఖరి టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ అనంతరం ఈమె తన రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్ అనంతరం సానియా మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. తన టెన్నిస్ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఈమె ఏడ్చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది భారత టెన్నిస్ అభిమానులకు కూడా కంటతడి పెట్టించింది.

ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ తన వృత్తిపరమైన టెన్నిస్ కెరియర్ మెల్బోర్నియాలోనే ప్రారంభమైందని ఈమె గుర్తు చేసుకున్నారు తన కొడుకు ముందే తన గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఎప్పుడు ఆడగలనని తాను అనుకోలేదంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సానియాకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.