అత్త యమ హాట్ అంటూ అనసూయ బ్యాక్ వీడియోపై కామెంట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ తో బుల్లితెర అభిమానులను ఆకట్టుకున్న ఈమె రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమాతో అనసూయకు విపరీతమైన క్రేజ్ రావడంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అనసూయ చేసే పోస్టులు క్షణాలలో వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె చీరకట్టులో ఉన్నటువంటి ఒక వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఇకపోతే చీరకట్టులో అనసూయ తన బ్యాక్ చూపిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియోపై ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. కొందరు సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అత్త హాట్ అంటూ ఫైర్ ఎమోజీ లను షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 లో అనసూయ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.