సానియా మీర్జాకు కోపమొచ్చింది, ఎందుకో తెలుసా?

జాత్యహంకారం చూపించడం సరి అయినది కాదని సానియా మీర్జా ఆవేదన వ్యక్తం చేసింది. జర్మనీ ఫుట్ బాల్ ఆటగాడు మెసట్ ఒజిల్ ‘గత కొన్ని నెలలుగా జర్మనీ జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య తనపై జాత్యహంకారం చూపుతుందంటూ’ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన సానియా “ఇలాంటి విషయాలు చదివినప్పుడు..ఒక క్రీడాకారిణిగానే కాదు మనిషిగా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు చెప్పేది వాస్తవమే మెసట్ ఒజిల్, జాత్యహంకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపదగినది కాదు. ఇది ఇంకా ఉండటం దారుణం” అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.

https://platform.twitter.com/widgets.js

మెసట్ ఒజిల్

ఇటీవలే ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ లో జర్మనీ జాతీయ జట్టు తరపున ఆడాడు మెసట్ ఒజిల్. ఇకపై ఆ జట్టుతో ఆడనని రెండు రోజుల క్రితం ప్రకటించాడు. దీనికి కారణం వారు చూపిస్తున్న జాత్యహంకారం అని తెలిపాడు. గెలిచినప్పుడు జర్మన్ అనటం, ఓడినప్పుడు వలసదారుడి వలనే ఓడిపోయాం అంటూ నిందిస్తున్నారు అంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు టర్కీ దేశాధ్యక్షుడిగా రెసెప్ తయిప్ ఎర్డోగన్ రెండోసారి ఎన్నికైన సందర్భంలో అతనితో కలిసి ఫోటో దిగాడు మెసట్. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. ఒజిల్ పూర్వీకులు టర్కీకి చెందినవారు కానీ ఒజిల్ జర్మనీలోని పుట్టి పెరిగాడు. అయినప్పటికీ వారు నన్నూ, నా కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఫోన్లు చేయటం, మెయిల్స్ పెట్టటం బాధ కలిగిస్తుందని అతను ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు.

https://platform.twitter.com/widgets.js