ఐపీఎల్-2020: అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ (107 నాటౌట్: 60 బంతుల్లో 14×4, 3×6) అజేయ శతకం బాదడంతో 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. సంజు శాంసన్ (54 నాటౌట్: 31 బంతుల్లో 4×4, 3×6)తో కలిసి బెన్‌స్టోక్స్ మూడో వికెట్‌కి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నుంచి ఆఖరి వరకూ ముంబయి కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. తాజా సీజన్‌లో 12 మ్యాచ్ ఆడిన రాజస్థాన్‌కి ఇది ఐదో గెలుపుకాగా.. 11వ మ్యాచ్ ఆడిన ముంబయి టీమ్‌కి ఇది నాలుగో ఓటమి.
Top effort from @benstokes38 107* and Samson 54* as they steer @rajasthanroyals to an 8-wicket win against #MI.#Dream11IPL pic.twitter.com/IuHBbTgEDa
— IndianPremierLeague (@IPL) October 25, 2020
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్‌ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా 18, 20 ఓవర్లలో సిక్స్‌ల మోత మోగించాడు. కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా 33, సూర్యకుమార్ యాదవ్ 40, ఇషాన్ కిషన్ 37, సౌరభ్ తివారి 34 పరుగులతో రాణించారు. డికాక్ 4, కీరన్ పొలార్డ్ 6 రన్స్ మాత్రమే చేశారు.
వాస్తవానికి ముంబై తొలి ఓవర్‌లోనే డికాక్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ ఆచితూచి ఆడుతూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. 90 పరుగుల వద్ద ఇషాన్, 95 వద్ద సూర్యకుమార్, 101 వద్ద పొలార్డ్ ఔట్ అయ్యారు. చివర్లో హార్దిక్ పాండ్యా, సౌరభ్ తివారీ అద్భుతమగా ఆడారు. 19వ ఓవర్లో తివారి ఔట్ అయిన తర్వాత.. పాండ్యా మరింత చెలరేగిపోయాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో కార్తీక్ త్యాగిపై విరుచుకుపడి.. ముంబైకి భారీ స్కోర్ అందించాడు.
రాజస్థాన్ బౌలర్లలో అంకిత్ రాజ్‌పుత్‌ను ఆటాడుకున్నారు ముంబై బ్యాట్స్‌మెన్. అతడు వేసిన 4 ఓవర్లలో ఏకంగా 60 రన్స్ పిండుకున్నారు. జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. కార్తీక్ త్యాగి ఒక వికెట్ తీశాడు.
రాజస్థాన్ ఇన్నింగ్స్ లో రాబిన్ ఊతప్ప 13, స్టీవెన్ స్మిత్ 11 తక్కువ పరుగులకే ఔట్ అయినప్పటికీ.. బెన్ స్టోక్స్, సంజూ శామ్సన్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు ఏకంగా 152 పరుగులు జోడించారు. జట్టు స్కోర్ 44 తర్వాత రాజస్థాన్‌లో ఒక్క వికెట్ కూడా పడలేదు. వీరిద్దరు చివరి వరకు ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ముంబై బౌలర్లలో ప్యాటిన్సన్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో ముంబై టీమ్ 11 గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 11 విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇంతకు ముందు ఓసారి రెండు టీమ్‌లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 6 జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 57 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరింది. కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ టీమ్.. 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో నాలుగింటిలో ఓటమి పాలయింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడి.. 5 మాత్రమే గెలిచింది. మరో ఏడింటిలో ఓడిపోయింది. 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది స్మిత్ సేన.